Prabhas : మళ్ళీ డ్యాన్స్ మాస్టర్ తో ప్రభాస్ సినిమా.. అప్పుడు ప్రభుదేవా, లారెన్స్.. ఇప్పుడు ఎవరంటే?

గతంలో డ్యాన్స్ మాస్టర్స్ డైరెక్టర్స్ గా మారగా ప్రభాస్ వాళ్ళ దర్శకత్వంలో నటించాడు.(Prabhas)

Prabhas : మళ్ళీ డ్యాన్స్ మాస్టర్ తో ప్రభాస్ సినిమా.. అప్పుడు ప్రభుదేవా, లారెన్స్.. ఇప్పుడు ఎవరంటే?

Prabhas

Updated On : November 15, 2025 / 9:42 AM IST

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు అన్ని భారీ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలను చేతిలో పెట్టుకొని వరుస హిట్స్ కొడుతూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. చేతిలో ఆల్రెడీ అరడజను సినిమాలు ఉన్నా ఇంకా కొత్త కథలు వింటున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఫౌజీ, రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు ఉన్నాయి. తాజాగా ప్రభాస్ మరో కొత్త సినిమా ఓకే చేసాడని సమాచారం.(Prabhas)

గతంలో డ్యాన్స్ మాస్టర్స్ డైరెక్టర్స్ గా మారగా ప్రభాస్ వాళ్ళ దర్శకత్వంలో నటించాడు. ప్రభుదేవాతో పౌర్ణమి సినిమా, లారెన్స్ మాస్టర్ తో రెబెల్ సినిమాలో నటించాడు. ఈ రెండు సినిమాలు కొంతమేరకు మెప్పించినా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఇంకో డ్యాన్స్ మాస్టర్ తో సినిమా చేస్తున్నాడని టాక్ నడుస్తుంది.

Also Read : Chiranjeevi : మెగాభిమానికి పిలిచి సినిమా ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. దేవుడు వరం ఇచ్చాడు అంటూ ఎమోషనల్ పోస్ట్..

సీనియర్ డ్యాన్స్ మాస్టర్, RRR లో నాటు నాటు సాంగ్ తో వరల్డ్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న మాస్టర్ ప్రేమ్ రక్షిత్ దర్శకుడిగా మారబోతున్నాడు. ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడని టాలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ప్రభాస్ కి కథ చెప్పాడని, ప్రభాస్ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడని తెలుస్తుంది.

ప్రేమ్ రక్షిత్ కెరీర్ కొరియోగ్రాఫర్ గా మొదలైంది ప్రభాస్ ఛత్రపతి సినిమాతోనే. ఆ తర్వాత బిల్లా, డార్లింగ్, బాహుబలి సినిమాలకు ప్రభాస్ తో కలిసి పనిచేసాడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది. మరి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తాడా చూడాలి.

Also Read : Bollywood Couple : పండంటి పాపాయికి జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ కపుల్.. వెడ్డింగ్ యానివర్సరీ రోజే డెలివరీ..