ప్రభు దేవా పెళ్లయిపోయిందా?

  • Published By: sekhar ,Published On : November 20, 2020 / 02:47 PM IST
ప్రభు దేవా పెళ్లయిపోయిందా?

Updated On : November 20, 2020 / 2:52 PM IST

Prabhu Deva Secret Marriage: పాపులర్ కొరియోగ్రాఫర్‌, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రభు దేవా తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

కట్ చేస్తే ప్రభుదేవా, బీహార్‌కు చెందిన పిజియోథెరపిస్ట్‌ను సెప్టెంబర్‌లోనే పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. కొత్త దంపతులు ఇప్పుడు చెన్నైలోనే ఉన్నారట.


గతంలో ప్రభు దేవా వెన్నెముక సమస్య కారణంగా ఫిజియో థెరపీ చేయించుకునే టైంలో తనకు ట్రీట్‌మెంట్ అందిస్తున్న ఫిజియో థెరపిస్ట్‌తో ప్రేమలో పడ్డారట.


ఎవరికీ తెలియకుండా కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత వీరిరువురూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారట. ప్రభు దేవా పెళ్లి వార్తల గురించి ఆయన కానీ ఆయన సన్నిహితులు కానీ స్పందించలేదు. అప్పటివరకు ప్రభు దేవా రెండో పెళ్లి నిజమే అనుకోవాలి మరి.

కాగా 1995 లో రామ్ లత్ ను వివాహం చేసుకున్న ప్రభు దేవా 2011 లో ఆమెకు విడాకులు ఇచ్చారు. తర్వాత హీరోయిన్ నయనతారతో ప్రేమ, సహజీవనం.. పెళ్లి వరకు వెళ్లి ప్యాకప్ చెప్పుకోవడం తెలిసిందే. ప్రభు దేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే’ చిత్రం ఇటీవల పూర్తయింది.