Jolly O Gymkhana : ‘జాలీ ఓ జింఖానా’ మూవీ రివ్యూ.. శవంతో నలుగురు లేడీస్ ఫుల్ కామెడీ..

జాలీ ఓ జింఖానా మూవీ ఇటీవల తెలుగు డబ్బింగ్ తో ఆహా ఓటీటీలో రిలీజ్ చేసారు.

Jolly O Gymkhana : ‘జాలీ ఓ జింఖానా’ మూవీ రివ్యూ.. శవంతో నలుగురు లేడీస్ ఫుల్ కామెడీ..

Prabhu Deva Madonna Sebastian Abhirami Yogi Babu Jolly O Gymkhana Movie Review

Updated On : May 20, 2025 / 6:49 PM IST

Jolly O Gymkhana Movie Review : ప్రభుదేవా, మడోన్నా సెబాస్టియన్, అభిరామి, యోగిబాబు, రెడిన్ కింగ్స్‌లీ, రోబో శంకర్, జాన్ విజయ్, శక్తి చిదంబరం, పూజిత పొన్నాడ.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘జాలీ ఓ జింఖానా’ తమిళ్ లో 2024 నవంబర్ లో రిలీజయిన ఈ సినిమాని ఇటీవల తెలుగు డబ్బింగ్ తో ఆహా ఓటీటీలో రిలీజ్ చేసారు. రాజేంద్ర రాజన్, పునీత రాజన్ నిర్మాణంలో శక్తి చిదంబరం దర్శకత్వంలో కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.

కథ విషయానికొస్తే.. భవాని(మడోన్నా సెబాస్టియన్) తన తల్లి చెల్లమ్మ(అభిరామి), తన ఇద్దరు చెల్లెళ్ళతో కలిసి ఉంటుంది. భవాని తాత బిర్యానీ సెంటర్ క్లోజ్ అయిపోవడంతో అప్పు చేసి మరీ మంచి రెస్టారెంట్ పెట్టిస్తారు. అదే సమయంలో అడై కాలరాజ్(మధుసూధనరావు) ఎమ్మెల్యేగా గెలిస్తే అతని మనుషులు వాళ్ళ రెస్టారెంట్ కి భారీగా బిర్యానీ ఆర్డర్ ఇస్తారు. బిల్లు రెండు లక్షలు అయిందని వెళ్తే డబ్బులివ్వకుండా కొట్టి పంపడంతో భవాని తాతయ్య హాస్పిటల్ లో పడతాడు. ఆపరేషన్ చేయడానికి డబ్బులు అవసరమవుతాయి. అదే సమయంలో లాయర్ పూన గుండ్రన్(ప్రభుదేవా) అడై కాలరాజ్ కి వ్యతిరేకంగా ఓ కేసు వాదిస్తాడు. దాంతో లాయర్ ని చంపమని రౌడీలకు డబ్బులు ఇస్తాడు అడై కాలరాజ్. భవాని, అతని తల్లి, చెల్లెల్లు అదే సమయంలో లాయర్ ని కలవడానికి హోటల్ కి వెళ్తే రూమ్ లో అప్పటికే లాయర్ చనిపోయి ఉంటాడు.

అక్కడికి వచ్చిన అడై కాలరాజ్ మనుషులు ఆ లాయర్ ని వీళ్ళే చంపారు అనుకోని ఎవరైతే ఏముంది అని వెళ్ళిపోతారు. ఆ హత్య వాళ్ళ మీద పడుతుందేమో అని లాయర్ శవం మాయం చేయడానికి తీసుకెళ్తారు భవాని & గ్యాంగ్. అయితే లాయర్ పేరు మీద బ్యాంక్ లో 10 కోట్లు ఉన్నాయని తెలియడంతో శవాన్ని వాడుకోని ఆ డబ్బు కొట్టేయాలని భవాని &గ్యాంగ్ ప్లాన్ చేస్తారు. లాయర్ ని వెతుక్కుంటూ కనిక(పూజిత పొన్నాడ) వస్తుంది. లాయర్ ఇంకా చనిపోలేదు బయటే తిరుగుతున్నాడు అని అడై కాలరాజ్ పై పార్టీ పెద్దలు ఒత్తిడి తెస్తారు. అసలు ఈ లాయర్ ఎవరు? అడై కాలరాజ్ కి వ్యతిరేకంగా ఏ కేసు వాదిస్తున్నాడు? లాయర్ ఎలా చనిపోయాడు? లాయర్ పేరు మీదున్న డబ్బులు భవాని & గ్యాంగ్ తీసుకున్నారా? కనిక ఎవరు? లాయర్ శవంతో ఆడవాళ్లు పడ్డ ఇబ్బందులు ఏంటి? భవాని తాత ఆపరేషన్ కి డబ్బులు వచ్చాయా? అడై కాలరాజ్ లాయర్ చనిపోయాడని ప్రూఫ్ ఇచ్చాడా… ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Jr NTR : ఆగి ఈ ప్రయాణంలో వెనక్కి చూసుకుంటే.. బర్త్ డే రోజు ఎన్టీఆర్ ఆసక్తికర పోస్ట్..

సినిమా విశ్లేషణ.. ఇది ఫుల్ లెంగ్త్ కామెడీ థ్రిల్లింగ్ సినిమా. సాయం కోసం ఓ నలుగురు ఆడవాళ్లు లాయర్ దగ్గరికి వెళ్తే ఆ లాయరు ఆల్రెడీ చనిపోయి ఉంటే లాయర్ శవంతో ఈ నలుగురు ఆడవాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అని కామెడీగా అక్కడక్కడా థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు. భవాని, ఆమె ఫ్యామిలీలో క్యారెక్టర్స్ కథకు సెట్ అయ్యేట్టు బాగా రాసుకున్నారు. మొదట్లో వాళ్ళ క్యారెక్టర్స్ గురించి చెప్పినప్పుడు ఎందుకు ఇంత అనిపిస్తుంది కానీ అవే క్లైమాక్స్ లో కరెక్ట్ గా వాడేలా రాసుకున్నారు. శవంతో కామెడీ చేసే సినిమాలు గతంలో చాలా వచ్చాయి. ఇటీవల విశాల్ మదగజరాజా, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో కూడా శవం కామెడీ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి చెందింది.

అయితే డబ్బులు, కేసు అంటూ కాస్త ఎమోషన్ కూడా చివర్లో జోడించారు. యోగిబాబు ట్రాక్ సపరేట్ గా పెట్టారు. ఆ ట్రాక్ లేకపోయినా సినిమాని నడిపించొచ్చు. ప్రతి పాత్రని కామెడీగా, ఆసక్తికర స్క్రీన్ ప్లే తో నవ్వించేలా రాసుకున్నారు. శవంతో ఫైట్స్, రోబో సెటప్, శవంతో ఆడవాళ్లు పడే ఇబ్బందులు అన్ని నవ్వు తెప్పిస్తాయి. అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే థ్రిల్లింగ్ కూడా బాగా మెయింటైన్ చేసారు. కామెడీతో పాటు సొసైటీలో జరుగుతున్న ఓ మోసం గురించి చూపించి మంచి మెసేజ్ కూడా ఇచ్చారు.

Also Read : Rana Naidu 2 : ‘రానా నాయుడు’ సీజన్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పట్నించి స్ట్రీమింగ్? ఈసారి ఎంత బూతు చూపిస్తారో..?

నటీనటుల పర్ఫార్మెన్స్.. ప్రభుదేవా సినిమా అంతా ఆల్మోస్ట్ 90 శాతం శవంలా నటించాడు. అలా నటించడం చాలా కష్టం. ఆ పాత్రలో ప్రభుదేవా జీవించాడు అనే చెప్పొచ్చు. మడోన్నా సెబాస్టియన్, అభిరామి పాత్రలు ఫుల్ గా నవ్విస్తాయి. జాన్ విజయ్, శక్తి చిదంబరం, యోగిబాబు కూడా తమ పాత్రలతో బాగానే నవ్వించారు. పూజిత పొన్నాడ చిన్న పాత్రలో గెస్ట్ గా మెరిపించింది. మధుసూధనరావు కామెడీ విలన్ గా బాగానే నటించారు. బ్యాంక్ మేనేజర్ పాత్రలో డైరెక్టర్ కూడా నవ్వించాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఒక మెయిన్ సాంగ్, మిగిలినవి సీన్స్ కి తగ్గట్టు వచ్చే బిట్ సాంగ్స్ ఉన్నాయి. అవన్నీ యావరేజ్. రెగ్యులర్ కథే అయినా కాస్త కొత్త స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో నవ్వించేలా రాసుకున్నారు దర్శకుడు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. శవంతో చూపించే ఫైట్స్ బాగా డిజైన్ చేసుకున్నారు.

Also Read : NTR Remuneration : ‘వార్ 2’ సినిమాకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు తెలుసా? బాలీవుడ్ లో చర్చగా ఎన్టీఆర్ రెమ్యునరేషన్..

మొత్తంగా ‘జాలి ఓ జింఖానా’ ఓ లాయర్ శవంతో నలుగురు ఆడవాళ్లు పడే ఇబ్బందులు, వాళ్ళ వెనక పడే రౌడీలతో కామెడీ థ్రిల్లింగ్ గా సాగింది. చూసి హ్యాపీగా నవ్వుకోవచ్చు.