Prabuthwa Junior Kalashala : మంచి కలెక్షన్స్ రాబడుతున్న లవ్ స్టోరీ.. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′..

‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ జూన్ 21న విడుదల అయింది.

Prabuthwa Junior Kalashala : మంచి కలెక్షన్స్ రాబడుతున్న లవ్ స్టోరీ.. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′..

Prabuthwa Junior Kalashala Movie getting Good Collections with Positive Talk

Updated On : June 23, 2024 / 4:23 PM IST

Prabuthwa Junior Kalashala : ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో బ్లాక్ యాంటీ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. జూన్ 21న ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమాతో విలన్ రోల్స్ చేసే సీనియర్ నటుడు మధుసూదన్ రావు తనయుడు ప్రణవ్ హీరోగా పరిచయం అయ్యాడు.

2004లో ఇంటర్ చదివే స్టూడెంట్స్ లవ్ స్టోరీ, కాలేజీ సరదాలు, ఎమోషనల్ సన్నివేశాలు.. ఇలా ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమా 90s కిడ్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ వారం దాదాపు 10 చిన్న సినిమాలు రిలీజవ్వగా ఈ సినిమా యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి మంచి టాక్ తెచ్చుకుంది.

Also Read : Pawan Kalyan Family : పవర్ ఫుల్ ఫ్యామిలీ ఫొటో.. పిల్లలతో పవన్ కళ్యాణ్.. ఫొటో వైరల్..

ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ కూడా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్తున్నారు. ఇక యూత్ లవ్ స్టోరీ కావడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రైలర్స్, టీజర్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా చూస్తుంటే స్కూల్, కాలేజీ డేస్ గుర్తొస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. అలాగే సినిమాలో సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ సీన్స్ కన్నీళ్లు పెట్టిస్తాయి. ఫస్ట్ డే కంటే కూడా రెండో రోజు కలెక్షన్స్ పెరిగాయని నిర్మాతలు తెలిపారు. ఇక సినిమా అయితే విజువల్స్ పరంగా, సాంకేతికంగా చాలా బాగుంది.