కరోనా సమయంలో వారికి సాయం చేస్తున్న యాంకర్ ప్రదీప్

మనం మన ఇంట్లోనే ఉంటూ మరో ఇంటి గురించి ఆలోచిద్దాం అనే స్లోగన్‌తో యాంకర్ ప్రదీప్ మాచిరాజు రోజువారీ కూలీలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. బుల్లితెరపై తనదైన శైలి మాటలతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు తన దాతృత్వం చాటుకున్నారు. ప్రస్తుతం కరోనా కల్లోలం సాగుతున్న సమయంలో.. సినీ, బుల్లితెరకు చెందిన పనులన్నీ ఆగిపోయాయి.
ఈ క్రమంలో టెలివిజన్ సీరియళ్లకు, షోలకు పనిచేసే రోజువారీ కూలీలకు రోజు గడవని పరిస్థితి. ఇటువంటి సమయంలో టీవీ కార్మికుల కోసం తమ వంతు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు ప్రదీప్ మాచిరాజు. తనకి తెలిసిన 50నుంచి 60కుటుంబాలకు, కార్మికులకు ఆర్థికసాయం అందించనున్నట్లు వెల్లడించారు.
‘హాయ్.. నేను మీ ప్రదీప్ మాచిరాజు. ప్రస్తుతం సమాజంలో ఎలాంటి పరిస్థితులున్నాయో మనందరికీ తెలుసు. బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండడమే ఎంతో ఉత్తమం. ఇళ్లకే పరిమితమవ్వడం వల్ల కరోనా గొలుసును మనం బ్రేక్ చేసిన వాళ్లమవుతాం. మన ద్వారా వేరేవాళ్లకు గానీ.. వేరేవాళ్ల ద్వారా మనకి కానీ కరోనా రాకుండా ఆగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌కు అనుగుణంగా ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాను.’
అయితే ప్రస్తుతం సినీ, బుల్లితెరలోని పనులు నిలిచిపోవడంతో షూటింగ్స్‌పైనే ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తోన్నవారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నా వంతుగా నాకు తెలిసిన 50 నుంచి 60 రోజువారీ కార్మికుల కుటుంబాలకు ఒక నెల రోజులపాటు ఆర్థికసాయం చేయాలనుకుంటున్నాను. నా తరఫున ఇది చిన్న ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ఇది నా టెలివిజన్ కుటుంబం అంటూ ట్విట్టర్ ద్వారా ఓ వీడియో పెట్టి తెలిపారు ప్రదీప్.
Chinna Praytnam ?#LetsFightCoronaTogether #StayHomeStaySafe #HelpEachOther pic.twitter.com/rkgDOFlhB6
— Pradeep Machiraju (@impradeepmachi) March 28, 2020