Pragya Jaiswal: లిప్‌లాక్ ఒకే.. కానీ కండిషన్స్ అప్లై!

అన్నీ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా కలిసి వస్తేనే సినీ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదుగుతారని నటుడు కోటా శ్రీనివాసరావు చెప్తుంటారు. పాపం... ప్రగ్యాజైస్వాల్ కు ఆ ఆవగింజంతే కొరవడిందేమో అనిపిస్తుంది. అందంలో వంక పెట్టేందుకు ఏమీ లేదు.. అసలే పొడుగుకాళ్ళు కావడంతో చీరకట్టు నుండి బికినీ వరకు ఏదేసినా అమ్మడు ఇట్టే ఆకట్టుకుంటుంది. యంగ్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు సరిపడే మెటీరియల్ కూడాను.

Pragya Jaiswal: లిప్‌లాక్ ఒకే.. కానీ కండిషన్స్ అప్లై!

Pragya Jaiswal

Updated On : July 14, 2021 / 8:54 PM IST

Pragya Jaiswal: అన్నీ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా కలిసి వస్తేనే సినీ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదుగుతారని నటుడు కోటా శ్రీనివాసరావు చెప్తుంటారు. పాపం… ప్రగ్యాజైస్వాల్ కు ఆ ఆవగింజంతే కొరవడిందేమో అనిపిస్తుంది. అందంలో వంక పెట్టేందుకు ఏమీ లేదు.. అసలే పొడుగుకాళ్ళు కావడంతో చీరకట్టు నుండి బికినీ వరకు ఏదేసినా అమ్మడు ఇట్టే ఆకట్టుకుంటుంది. యంగ్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు సరిపడే మెటీరియల్ కూడాను. కానీ.. ఈ అందం ఆ మేకర్స్ కు ఇంకా కంటపడలేదేమో.

Pragya Jaiswal (1)

Pragya Jaiswal (1)

ప్రగ్యా ప్రస్తుతం తెలుగులో బాలయ్య సరసన అఖండ సినిమాతో పాటు మిగతా బాషలలో అడపాదడపా సినిమాలు చేస్తుంది. అయితే.. ప్రస్తుతం అఖండ మీదే ఆశలు పెట్టుకున్న ప్రగ్యా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యమా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు ఫోటో షూట్స్ తో కుర్రకారుకి నోరూరిస్తూనే.. వాళ్ళతో చిట్ చాట్ కూడా చేస్తుంది. అలానే తాజాగా నెటిజన్లతో చిట్ చాట్ చేసిన ఈ భామకి అనుకోకుండా ఓ నెటిజన్ నుండి ఓ వింత ప్రశ్న ఎదురైంది. అలాంటి ప్రశ్నకు మిగతా హీరోయిన్స్ నుండి సమాధానం రాదేమో కానీ ప్రగ్యా మాత్రం ఎంతో ధీటుగా ఆన్సర్ చెప్పింది.

Pragya Jaiswal (2)

Pragya Jaiswal (2)

ఓ నెటిజన్ ప్రగ్యాను.. డేటింగ్ కు వెళ్లిన తొలిరోజే మీ పార్టనర్ కు లిప్ లాక్ ఇస్తారా అని అడిగాడు. అయితే ప్రగ్యా మాత్రం లిప్ లాక్ ఇస్తా కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పింది. ముందుగా డేటింగ్ వెళ్లి కొన్నిరోజులు ఒకరిని ఒకరు తెలుసుకున్న తర్వాత నచ్చి అతనితో ప్రేమలో పడితే లిప్ లాక్ ఇచ్చేస్తానని చెప్పుకొచ్చింది. అయితే.. అసలు డేటింగ్ వేరు.. లవ్ వేరని.. ప్రతి డేటింగ్ ప్రేమ కాదని.. ప్రేమలో ముద్దులు తప్పేమీ కాదనేలా చెప్పుకొచ్చింది. దీనిని బట్టి చూస్తే ప్రగ్యా ఈ ప్రేమాటలో మస్తు క్లారిటీగానే ఉన్నట్లనిపిస్తుంది.