Ponniyin Selvan : డెడికేషన్.. గాయంతోనే షూటింగ్‌కి ప్రకాష్ రాజ్..

ప్రకాష్ రాజ్ గాయంతోనే షూటింగులో పాల్గొనడం చూస్తుంటే ప్రొఫెషన్ పట్ల ఆయనకున్న ప్యాషన్ ఎలాంటిదో అర్థమవుతోంది..

Ponniyin Selvan : డెడికేషన్.. గాయంతోనే షూటింగ్‌కి ప్రకాష్ రాజ్..

Prakash Raj

Updated On : August 18, 2021 / 11:56 AM IST

Ponniyin Selvan: కరోనా కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడిన క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ పున: ప్రారంభమైంది.. చియాన్ విక్రమ్, కార్తీ,  త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, మరియు నిలల్‌గల్ రవి తదితరులు నటిస్తున్నారు.. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు..

Prakash Raj : మెగాస్టార్‌ని మీట్ అయిన ప్రకాష్ రాజ్..

ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఆయన చేతికి గాయం అయ్యింది. హైదరాబాద్‌లో సర్జరీ జరిగింది. ‘మా’ ఎన్నికల హడావిడి, షూటింగ్స్ బిజీలో ఉండే ప్రకాష్ రాజ్, డాక్టర్లు విశ్రాంతి అవసరం అని చెప్పినా కూడా వినకుండా.. గాయంతోనే షూటింగులో పాల్గొనడం చూస్తుంటే ప్రొఫెషన్ పట్ల ఆయనకున్న ప్యాషన్ ఎలాంటిదో అర్థమవుతోంది.

Prakash Raj: సన్‌షైన్ హాస్పిటల్‌లో ప్రకాష్ రాజ్‌కు పూర్తైన ఆపరేషన్

గ్వాలియర్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాక.. కార్తి, మణిరత్నంతో కలిసి తీసుకున్న పిక్ షేర్ చేస్తూ.. ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగులో పాల్గొంటున్నట్లు తెలిపారు ప్రకాష్ రాజ్. మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సంయుక్తంగా సుభాస్కరన్‌ సమర్పణలో అత్యతం ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.