తడ్కా తెచ్చిన తంటా.. కోర్టు వివాదాల్లో ప్రకాష్ రాజ్

  • Published By: chvmurthy ,Published On : August 25, 2019 / 09:56 AM IST
తడ్కా తెచ్చిన తంటా.. కోర్టు వివాదాల్లో ప్రకాష్ రాజ్

Updated On : August 25, 2019 / 9:56 AM IST

విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్  వివాదాల్లో చిక్కుకున్నారు. ఎప్పూడూ ఏదో ఒక విషయమై తన అభిప్రాయాలు  చెపుతూ వాటి వల్ల వచ్చిన వివాదాలతో  వార్తల్లో నిలుస్తారు. ఇప్పడు మరో  వివాదంలో చిక్కుకుని  వార్తల్లోకి వచ్చారు.  ఒక సినిమా నిర్మాణ సమయంలో ఏర్పడ్డ ఆర్థిక సమస్యల కారణంగా ఆయనకు ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. 

ప్రకాష్ రాజ్ తడ్కా అనే సినిమాకు దర్శకత్వం వహిస్తూ బాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. ఈ సినిమా మలయాళ సినిమా సాల్ట్ అండ్ పెప్పర్ కు రీమేక్.  మూడేళ్ల క్రితం నానాపటేకర్, తాప్సీ పన్ను, ఆలీ ఫజల్ కాంబినేషన్‌లో ఈ రీమేక్ సినిమాను అనౌన్స్ చేశారు ప్రకాశ్‌రాజ్. సినిమాను ప్రముఖ డిజిటల్ సంస్థ  జీ సంస్థ వారి ఎస్సెల్ విజన్ గ్రూప్ తోకలిసి నిర్మించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం బడ్జెట్లో కొంత భాగంగా  4.5 కోట్ల రూపాయలను వారికి చెల్లించారు. కానీ ఆయన ఇంకా చాలా మొత్తం ఇవ్వాల్సి ఉందని వారు ఆరోపిస్తున్నారు. బకాయిలు మొత్తం కలిపి రూ. 5.88 కోట్ల రూపాయలకు చేరాయని  ఎస్ ఎల్ గ్రూప్ పేర్కోంది.

దీంతో ఎస్ ఎల్ గ్రూప్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.  బకాయిలు చెల్లింపులో భాగంగా రెండు కోట్ల చెక్ ను ఎస్సెల్ వారికి ప్రకాష్ రాజ్ చెల్లించాడు. కోర్టువారు ప్రకాష్ రాజ్ ను మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించమని ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఆదేశించారు. దానికి ప్రకాష్ రాజ్ 2019  జులై లోపు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇప్పటివరకు ఆయన ఆడబ్బులు ఇవ్వలేక పోయారు.

ఇప్పుడు ఇదే కేసుపై తాజాగా స్పందించిన బాంబే హైకోర్టు జడ్జి శ్రీ రామ్.. ప్రకాష్ రాజ్ పై బాంబు పేల్చాడు. ఒకవేళ తాను ఇచ్చిన ఆ రెండు కోట్ల చెక్ కనుక బౌన్స్ అయితే ప్రకాష్ రాజ్ పై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 30, 2019 కివాయిదా వేశారు.