Pranayagodari : ‘ప్రణయగోదారి’ రిలీజ్ డేట్ అనౌన్స్.. పుష్ప 2 రిలీజయిన వారానికే..

తాజాగా ప్రణయగోదారి సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Pranayagodari : ‘ప్రణయగోదారి’ రిలీజ్ డేట్ అనౌన్స్.. పుష్ప 2 రిలీజయిన వారానికే..

Pranayagodari Movie Release Date Announced

Updated On : November 29, 2024 / 7:52 PM IST

Pranayagodari : కమెడియన్ అలీ సోదరుని తనయుడు సదన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ప్రణయగోదారి. ప్రియాంక ప్రసాద్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పిఎల్‌వి క్రియేషన్స్‌ బ్యానర్ పై పారమళ్ళ లింగయ్య నిర్మాణంలో పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Also Read : Manchu Vishnu : తన హెయిర్ స్టైలిస్ట్ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళిన మంచు విష్ణు.. అతనికి ఎంత సపోర్ట్ చేశాడో తెలుసా..

ప్రణయగోదారి సినిమా డిసెంబర్ 13న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ తో ఈ సినిమా గోదావరి ఒడ్డున జరిగే ఓ ప్రేమకథ అని తెలుస్తుంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు మూవీ యూనిట్.

Pranayagodari Movie Release Date Announced

అయితే పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుండటంతో ఆ డేట్ లో, ఆ తర్వాత వారం కూడా ఇప్పటిదాకా వేరే సినిమాలు ఏవి ప్రకటించలేదు. కానీ ప్రణయగోదారి సినిమా పుష్ప 2 రిలీజయిన వారానికే రిలీజ్ చేస్తుండటంపై చర్చగా మారింది.