Jai Hanuman : శ్రీరామనవమి నాడు జై హనుమాన్ అప్డేట్.. అదిరిపోయే పోస్టర్..

శ్రీరామనవమి నాడు జై హనుమాన్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ. హనుమంతుడు రాముడుకి..

Jai Hanuman : శ్రీరామనవమి నాడు జై హనుమాన్ అప్డేట్.. అదిరిపోయే పోస్టర్..

Prasanth Varma gave update on Jai Hanuman with poster

Jai Hanuman : తేజ సజ్జని సూపర్ హీరోగా చూపిస్తూ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘హనుమాన్’. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాగా ఈ మూవీ ఎండింగ్ లోనే సీక్వెల్ కి దర్శకుడు లీడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

‘జై హనుమాన్’ అంటూ సీక్వెల్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సీక్వెల్ లో ఆంజనేయ స్వామి సూపర్ హీరోగా కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందని ఎదురు చూస్తున్నారు. కాగా నేడు శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ ఓ అదిరిపోయే పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు.

Also read : Actress Divi : ప్రకృతిలో పరవశిస్తూ అందాలతో మనసు దోచేస్తున్న దివి..

హనుమంతుడు రాముడుకి ప్రమాణం చేస్తున్న ఫోటోని షేర్ చేస్తూ ప్రశాంత్ వర్మ.. “నేను ఆడియన్స్ కి ప్రామిస్ చేస్తున్నాను. ఈ సినిమాతో ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటాను. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూపిస్తాను” అంటూ మాట ఇచ్చారు. కాగా రిలీజ్ చేసిన పోస్టర్ డిజైన ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.