KL Rahul : కేఎల్‌ రాహుల్‌ భారీ సెంచరీ.. ఆస్ట్రేలియా-ఏ పై భార‌త్ ఘ‌న విజ‌యం.. సిరీస్ కైవ‌సం..

కేఎల్ రాహుల్ (KL Rahul) భారీ శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో ఆస్ట్రేలియా-ఏ పై భార‌త్ విజ‌యం సాధించింది.

KL Rahul : కేఎల్‌ రాహుల్‌ భారీ సెంచరీ.. ఆస్ట్రేలియా-ఏ పై భార‌త్ ఘ‌న విజ‌యం.. సిరీస్ కైవ‌సం..

KL Rahul century helps India A beat Australia A in 2nd Unofficial Test

Updated On : September 26, 2025 / 3:16 PM IST

KL Rahul : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ భారీ శ‌త‌కంతో (176 నాటౌట్; 210 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) చెల‌రేగాడు. ఫ‌లితంగా ఆస్ట్రేలియా-ఏతో జ‌రిగిన రెండో అన‌ధికారిక టెస్టు మ్యాచ్‌లో భార‌త్‌-ఏ జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల‌ అన‌ధికారిక టెస్టు సిరీస్‌ను భార‌త్ 1-0తో సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఏ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. కెప్టెన్‌ నాథన్‌ మెక్‌స్వీనీ (74), జాక్‌ ఎడ్‌వర్డ్స్‌ (88), టాడ్‌ మర్ఫీ (76) లు రాణించ‌డంతో 97.2 ఓవర్లలో 420 ప‌రుగులు చేసింది. భారత బౌలర్లలో మానవ్‌ సుతార్‌ ఐదు వికెట్లు తీశాడు. బ్రార్‌ మూడు, సిరాజ్, ప్రసిద్‌ కృష్ణ త‌లా ఓ వికెట్ తీశారు.

Asia Cup 2025 : భార‌త్, పాక్ ఫైన‌ల్‌ కోసం బంగ్లాదేశ్ కి అన్యాయం?.. రెండు నెలల ముందే ఫిక్స్..!

ఆ త‌రువాత ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (11) (KL Rahul) , దేవ్‌దత్‌ పడిక్కల్‌ (1), కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ (1), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (1) విఫ‌ల‌మైన‌ప్ప‌టికి సాయి సుద‌ర్శ‌న్ (75) రాణించ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 194 ప‌రుగులు చేసింది. దీంతో ఆసీస్‌కు 226 ప‌రుగుల మొద‌టి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.

అయితే.. భార‌త బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 185 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కెప్టెన్‌ నాథన్‌ మెక్‌స్వీనీ (85 నాటౌట్‌), వికెట్‌ కీపర్‌ జోష్‌ ఫిలిప్‌ (50) హాఫ్ సెంచ‌రీలు చేశారు. మానవ్‌ సుతార్‌, గుర్నూర్‌ బ్రార్ లు చెరో మూడు వికెట్లు తీశారు. ఠాకూర్‌, సిరాజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

IND vs SL : ‘భార‌త్‌ను ఓడించి.. మేము తోపులం అని నిరూపించుకుంటాం..’ మ్యాచ్‌కు ముందు దాసున్ షనక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం క‌లుపుకుని భార‌త్‌-ఏ ముందు ఆసీస్‌-ఏ జ‌ట్టు 412 ప‌రుగుల లక్ష్యాన్ని నిలిపింది. కేఎల్ రాహుల్ (176), సాయి సుద‌ర్శ‌న్ (100) శ‌త‌కాల‌తో చెల‌రేగారు. కెప్టెన్ ధ్రువ్ జురెల్ (56) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. దీంతో ల‌క్ష్యాన్ని భార‌త్ 91.3 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది.

భారత్‌-ఏ వర్సెస్‌ ఆస్ట్రేలియా- ఏ రెండో అనధికారిక టెస్టు మ్యాచ్ స్కోర్లు..

ఆస్ట్రేలియా-ఏ – 420 & 185
భారత్ -ఏ -194 & 413/5