IND vs SL : ‘భారత్‌ను ఓడించి.. మేము తోపులం అని నిరూపించుకుంటాం..’ మ్యాచ్‌కు ముందు దాసున్ షనక ఆసక్తికర వ్యాఖ్యలు
ఆసియాకప్ 2025 సూపర్ 4లో భాగంగా శుక్రవారం భారత్, శ్రీలంక (IND vs SL ) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Dasun Shanaka interesting comments ahead of India clash in Asia cup 2025
IND vs SL : ఆసియాకప్ 2025లో శ్రీలంక పేలవ ప్రదర్శన చేసింది. సూపర్-4లో వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల చేతిలో ఓడిపోవడంతో ఫైనల్ రేసు నుంచి ఆ జట్టు ఎప్పుడో నిష్ర్కమించింది. ఇక చివరి మ్యాచ్‌లో భారత్‌తో నేడు (శుక్రవారం సెప్టెంబర్ 26న) తలపడనుంది. కనీసం భారత్ పైనా విజయం సాధించింది విజయంతో టోర్నీ ముగించాలని శ్రీలంక ఆరాటపడుతోంది.
వాస్తవానికి గ్రూప్ స్టేజీలో శ్రీలంక అద్భుత ప్రదర్శన చేసింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్ టాపర్‌గా సూపర్-4లో అడుగుపెట్టింది. ఆ తరువాత నుంచే ప్రదర్శన తీసికట్టుగా మారింది. గ్రూప్ స్టేజీలో తాము ఓడించిన బంగ్లాదేశ్ చేతిలోనే ఓడిపోయింది. ఆ తరువాత పాక్‌పై ఓటమితో రేసు నుంచి నిష్ర్కమించింది.
IND vs PAK : 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలోనే తొలిసారి ఇలా.. ఇప్పుడు ఏం జరుగుతుందో మరీ..
భారత్‌తో తలపడనున్న నేపథ్యంలో (IND vs SL) ఆ జట్టు మాజీ కెప్టెన్ దాసున్ షనక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారత్‌ను ఓడించే సత్తా తమ జట్టుకు ఉందని, గెలిచి సగర్వంగా టోర్నీ నుంచి నిష్ర్కమిస్తామని అన్నాడు.
‘భారత్‌తో మ్యాచ్ కోసం మేము ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాం. ఈ మ్యాచ్‌లో గెలిచి మేము మంచి జట్టే అని నిరూపించుకుంటాం. దురదృష్టవశాత్తు టోర్నీ నుంచి నిష్ర్కమించాం. ఈ టోర్నీలో చేసిన తప్పులను సరిదిద్దుకుని వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీకి సన్నద్ధం అవుతాం. భారత్‌తో మ్యాచ్ కుర్రాళ్లకు మంచి అవకాశం.’ అని షనక అన్నాడు.
Team India : వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్.. ఇప్పుడెలా?
ఇదిలా ఉంటే.. ఇప్పటికే భారత్, పాక్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఆదివారం (సెప్టెంబర్ 28 ) దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా.. 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో భారత్, పాక్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుండడం ఇదే తొలిసారి. అంతేకాదండోయ్ ఓ ఎడిషన్‌లో భారత్, పాక్ జట్లు మూడు సార్లు తలపడడం కూడా ఇదే తొలిసారి