Jai Hanuman first look : ‘జై హ‌నుమాన్’ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది..

తేజ స‌జ్జ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం హ‌నుమాన్‌.

Jai Hanuman first look : ‘జై హ‌నుమాన్’ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది..

Jai Hanuman first look

Updated On : October 30, 2024 / 5:52 PM IST

Jai Hanuman first look : తేజ స‌జ్జ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం ‘హ‌నుమాన్‌’. ఈ ఏడాది సంక్రాంతికి వ‌చ్చిన ఈ సినిమా పాన్ ఇండియా విజ‌యాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా శ్రీరాముడికి హ‌నుమంతుడు ఇచ్చిన మాటేమిటి అనే ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ‘జై హ‌నుమాన్’ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ మూవీలో హనుమంతుడి పాత్రను ఎవరు పోషిస్తారు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించింది.

తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి హ‌నుమంతుడి పాత్ర‌లో న‌టించారు. రిష‌బ్ శెట్టి హ‌నుమంతుడి గెట‌ప్ అదిరిపోయింది. కాంతారతో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఫేం తెచ్చుకున్న రిషభ్ శెట్టి ఇప్పుడీ పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ మూవీ సీక్వెల్ లో భాగం కావడంతో అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.


ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. హ‌నుమాన్ చిత్రానికి మించి వంద రెట్లు భారీ స్థాయిలో జై హ‌నుమాన్ ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. సీక్వెల్‌లో తేజ స‌జ్జా హీరో కాద‌ని, సీక్వెల్‌లోనూ అత‌డు హ‌నుమంతు పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు అని చెప్పాడు. ఈ చిత్రంతో పాటు అధీర‌, మ‌హాకాళి సినిమాలు కూడా ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో విడుద‌ల కానున్నాయి.