Rana – Jai Hanuman : జై హనుమాన్ సినిమాలో రానా కూడా..? ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ..

జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటించబోతున్నట్టు పోస్టర్ కూడా రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చేసాడు ప్రశాంత్ వర్మ. అయితే తాజాగా..

Rana – Jai Hanuman : జై హనుమాన్ సినిమాలో రానా కూడా..? ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ..

Prasanth Varma Shared a Photo with Rana and Rishab Shetty and post as Jai Jai Hanuman Photo goes Viral

Updated On : November 4, 2024 / 4:57 PM IST

Rana – Jai Hanuman : హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా భారీ విజయం సాధించి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించి ప్రేక్షకులను తన సినిమాల కోసం ఎదురుచూసేలా చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈయన సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటికే ఏడు సినిమాలు ప్రకటించాడు. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కూడా ప్రకటించాడు. అయితే గతంలో జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్రలో రానా, రామ చరణ్, చిరంజీవి.. ఇలా పలువురు నటిస్తారని వార్తలు వచ్చినా తాజాగా దీపావళికి క్లారిటీ ఇచ్చేసాడు.

Also Read : Bellamkonda Srinivas : ‘భైరవం’ అంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. లుక్ అదిరిందిగా.. మనోజ్, నారా రోహిత్ ముఖ్య పాత్రల్లో..?

జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటించబోతున్నట్టు పోస్టర్ కూడా రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చేసాడు ప్రశాంత్ వర్మ. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ పోస్ట్ చేసిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. రిషబ్ శెట్టి, రానాతో కలిసి దిగిన ఫోటోని ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జై జై హనుమాన్ అని రాసి తన సినిమాటిక్ యూనివర్స్ ని కూడా ట్యాగ్ చేసాడు. దీంతో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటించినా సినిమాలో మరో పాత్రలో రానా కూడా నటిస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది.

Image

గతంలోనే ప్రశాంత్ వర్మ తన యూనివర్స్ లో అన్ని సినీ పరిశ్రమల నుంచి చాలా మంది హీరోలు నటిస్తారని చెప్పాడు. ఇప్పటికే ఈ లిస్ట్ లో తేజ సజ్జ, రిషబ్ శెట్టి, రానా, కార్తీ, రణవీర్ సింగ్ ఉన్నారని అంటుండగా చిరంజీవి, ప్రభాస్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఒక్క పోస్ట్ తో ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో చెప్పేసాడు. ప్రేక్షకులు జై హనుమాన్, ఈ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.