Bellamkonda Srinivas : ‘భైరవం’ అంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. లుక్ అదిరిందిగా.. మనోజ్, నారా రోహిత్ ముఖ్య పాత్రల్లో..?

తాజాగా నేడు శ్రీనివాస్ కొత్త సినిమాని ప్రకటించారు.

Bellamkonda Srinivas : ‘భైరవం’ అంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. లుక్ అదిరిందిగా.. మనోజ్, నారా రోహిత్ ముఖ్య పాత్రల్లో..?

Bellamkonda Sai Srinivas Next Movie Bhairavam Announced under Vijay Kanakamedala Direction Poster Released

Updated On : November 4, 2024 / 4:28 PM IST

Bellamkonda Srinivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగులో చివరిసారిగా 2021 లో అల్లుడు అదుర్స్ సినిమాతో పలకరించి హిట్ కొట్టాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ తీసి డిజాస్టర్ అందుకున్నాడు. తెలుగులో శ్రీనివాస్ సినిమా వచ్చి మూడేళ్లు దాటింది. త్వరలో టైసన్ నాయుడు అనే సినిమాతో రాబోతున్నాడు. అయితే తాజాగా నేడు శ్రీనివాస్ కొత్త సినిమాని ప్రకటించారు.

Also Read : Nithiin Tammudu : శివరాత్రికి ‘తమ్ముడు’ వచ్చేస్తున్నాడు.. పవన్ టైటిల్‌తో నితిన్.. తమ్ముడికి అక్క ఎవరో తెలుసా?

అల్లరి నరేష్ తో నాంది, ఉగ్రం.. లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణంలో నేడు ‘భైరవం’ అనే టైటిల్ తో సినిమాను ప్రకటించారు. ఈ సందర్భంగా పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గుడిముందు ఓ చేతిలో త్రిశూలం, ఓ చేతిలో కొడవలి పట్టుకొని కోపంగా చూస్తూ కూర్చున్నాడు. ఓ యాక్షన్ సీక్వెన్స్ లోది ఈ ఫోటో అని తెలుస్తుంది.

Image

ప్రస్తుతం ఈ సినిమా షూట్ జరుగుతుంది. మరి హిట్స్ తో ఉన్న విజయ్ బెల్లంకొండ శ్రీనివాస్ కు ఈ భైరవంతో హిట్ ఇస్తాడేమో చూడాలి. టైటిల్, పోస్టర్ చూస్తుంటే యాక్షన్ తో పాటు మైథలాజి టచ్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాని ప్రకటిస్తూ మంచు మనోజ్ ని, నారా రోహిత్ ని కూడా ట్యాగ్ చేసారు నిర్మాణ సంస్థ. దీంతో ఈ సినిమాలో మనోజ్, నారా రోహిత్ ఏదైనా కీలక పత్రాలు చేస్తున్నారేమో అని తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురుచూడండి అంటూ తెలిపారు మూవీ యూనిట్.