Hanuman : హనుమాన్ టికెట్ ధరలు ఇలా ఉన్నాయట.. మల్టీప్లెక్స్‌లో ఎంతంటే..!
రిలీజ్ కి సిద్దమవుతున్న తేజ సజ్జ హనుమాన్ మూవీ టికెట్ ధరలు ఇలా ఉన్నాయట. మల్టీప్లెక్స్‌లో ఎంతంటే..

prasanth varma Teja Sajja Hanuman movie ticket price details
Hanuman : యువ హీరో తేజ సజ్జ హీరోగా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా నార్త్ సైడ్ ఈ చిత్రం పై మంచి ఆసక్తి కనిపిస్తుంది. కాగా ఈమధ్య కాలంలో తెలుగు స్టేట్స్ లో సినిమా రిలీజ్ మొదటి వారంలో టికెట్ రేటు పెంచే ఆనవాయితీ ఒకటి అలవాటు అయ్యింది.
ఈక్రమంలోనే ఆయా సినిమాల బడ్జెట్ లు బట్టి టికెట్ ధరలు నిర్ణయిస్తున్నారు. మరి రిలీజ్ కి సిద్దమవుతున్న హనుమాన్ టికెట్ ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేసేయండి. తెలంగాణలో హైదరాబాద్ సిటీ తప్పించి మిగిలిన అన్ని ఏరియాల్లో సింగల్ స్క్రీన్ టికెట్ ధర రూ.110 ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ లో రూ.150కి పెట్టినట్లు సమాచారం. మల్టీప్లెక్స్ లు విషయానికి వస్తే.. అన్ని చోట్ల రూ.295కి ఖరారు చేసినట్లు చెబుతున్నారు.
Also read : Captain Miller : ‘కెప్టెన్ మిల్లర్’ ట్రైలర్ రిలీజ్.. ఫుల్ యాక్షన్‌తో అదిరిపోయింది..
కాగా సంక్రాంతికి ఈ సినిమాతో రిలీజ్ అవుతున్న సినిమాలకు ఈ రేట్లకు మించి టికెట్స్ ధరని ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే.. హనుమాన్ మూవీకి అది కలిసొచ్చే అంశం అవుతుంది. పండక్కి ప్రతి ఒక్కరు చూసేలా హనుమాన్ ధరలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వడం లేదని నిర్మాత చెబుతున్నారు. హైదరాబాద్ సిటీలో కేవలం నాలుగు నుంచి ఆరు థియేటర్స్ మాత్రమే ఇచ్చినట్లు చెబుతున్నారు.
అయితే వీటన్నిటికీ తమ విజయంతోనే బదులు ఇస్తాము అంటూ మూవీ టీం చెబుతుంది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. జనవరి 7న ఆదివారం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ హాల్ లో చిరంజీవి ముఖ్య అతిథి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ సినిమాలో చిరంజీవి కూడా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో హనుమంతుడి పాత్ర కోసం చిరంజీవి రూపాని ఉపయోగించారని సమాచారం.