Prema Madhuram : ఫిలిం ఛాంబర్ లో ‘ప్రేమ మధురం’ టైటిల్ లాంచ్..

నేడు ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. (Prema Madhuram)

Prema Madhuram : ఫిలిం ఛాంబర్ లో ‘ప్రేమ మధురం’ టైటిల్ లాంచ్..

Prema Madhuram

Updated On : January 21, 2026 / 7:10 PM IST

Prema Madhuram : ఎన్.జి.ఆర్ సినిమా ప్రొడక్షన్, వి.ఎల్ 14 రీల్ సినిమా ప్రొడక్షన్ బ్యానర్స్ పై ఎస్కే జలీల్, స్వామి దాసు నాగరత్నం నిర్మాణంలో పరకోటి బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రేమ మధురం. ఇద్దరూ ఒకటయ్యారు ట్యాగ్ లైన్. చంటి హీరోగా, ఏపీ స్టేట్ క్రికెట్ ప్లేయర్ సంధ్యతో పాటు సుష్మ, దాక్షాయిని హీరోయిన్స్ గా, జబర్దస్త్ గడ్డం నవీన్, పంచ్ ప్రసాద్, వింజమూరి మధు.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Prema Madhuram)

నేడు ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో తెలుగు ఫిలిం చాంబర్ కోశాధికారి ముత్యాల రామదాసు మాట్లాడుతూ.. ఇప్పుడు చిన్న సినిమా తీయడం చాలా కష్టం అయిపోయింది. ఆసక్తితో సినిమా చేయడానికి వచ్చినా ఇక్కడ ఖర్చులు, విడుదల సమయంలో ఇబ్బందుల వల్ల సినిమాలు చేయడం కష్టమైపోతుంది. అయినా నిర్మాతలు వస్తూనే ఉన్నారు. అది కళామతల్లి గొప్పతనం. ఈ సినిమాకు ఫిలిం ఛాంబర్ అండగా ఉంటుంది అని అన్నారు.

Also Read : Nidhhi Agerwal : 14 ఏళ్లకే ఆల్కహాల్ అలవాటు.. ఫ్రెండ్స్ తో కలిసి మందు కొట్టి.. అలా జరగడంతో దెబ్బకి..

డైరెక్టర్ పరకోటి బాలాజీ మాట్లాడుతూ.. ప్రేమ మధురం ఫ్యామిలీతో చూసే కామెడీ, యాక్షన్ సినిమా. ఈ సినిమా తర్వాత గరుడ అనే మరొక సినిమా దర్శకత్వం చేయబోతున్నాను అని తెలిపారు. జబర్దస్త్ గడ్డం నవీన్ మాట్లాడుతూ.. సినిమాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా షూటింగ్ ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలని, కంటెంట్ ఉన్న చిత్రం ప్రేమ మధురం అని అన్నారు.

హీరో చంటి మాట్లాడుతూ.. నాకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ కథ చాలా మాస్ గా ఉంటుంది. నాకు మాస్ అంటే ఇష్టం అని అన్నారు.

Also Read : Nehaa Pathan : కొత్త సినిమా ఓపెనింగ్ లో సందడి చేసిన నేహా పఠాన్.. క్యూట్ ఫోటోలు..