Kali Movie Director : ‘కలి’ పురుషుడితో సినిమా.. మైథలాజికల్ టచ్‌తో మరో ఆసక్తికర సినిమా..
కలి డైరెక్టర్ శివ శేషు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

Prince Cecil Naresh Agastya Kali Movie Director Siva Sashu Interesting Comments about Movie
Kali Movie Director : యువ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య మెయిన్ లీడ్స్ లో రాబోతున్న సినిమా ‘కలి’. కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా శివ శేషు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అక్టోబర్ 4న ఈ కలి సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కలి డైరెక్టర్ శివ శేషు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
శివ శేషు మీడియాతో సినిమా మెయిన్ ప్లాట్ గురించి చెప్తూ.. కొంతమంది మంది జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా. ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో 70 శాతం మందికి ఏదో ఒక సమయంలో ఆత్మహత్య ఆలోచన వస్తుంది అంట. ఆత్మహత్య పరిష్కారం కాదు అనే కథని ఆసక్తిగా రెండు పాత్రల మధ్య కథనంతో కలి పురుషుడు అని కొంత మైథలాజి టచ్ ఇచ్చి చూపించే ప్రయత్నం చేసాము అని తెలిపారు.
తన గురించి చెప్తూ.. డైరెక్టర్ కావాలని ఎప్పుటినుంచో అనుకున్నాను. కొన్నాళ్ళు బిజినెస్ చేసి ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చాను. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా పని చేసి ఆ తర్వాత భాగమతి డైరెక్టర్ అశోక్, సప్తగిరి ఎక్స్ ప్రెస్ డైరెక్టర్ అరుణ్ పవార్ దగ్గర పనిచేశాను అని తెలిపారు. సినిమా గురించి మాట్లాడుతూ.. లాక్ డౌన్ సమయంలో కలి పేరుతో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. ప్రిన్స్ కు చెప్తే ఓకే అన్నారు. మొదట్లో కొన్ని ఇబ్బందులు పడ్డాం. జగపతి బాబు గారిని ఓ క్యారెక్టర్ కు అనుకున్నాం. కానీ అనుకోని కారణాలతో ఆయన సెట్ అవ్వక నరేష్ అగస్త్యను తీసుకున్నాం. కథ రెడీ అయ్యాక సెట్స్ మీదకు వెళ్లేందుకు ఆల్మోస్ట్ ఏడాదిన్నర పట్టింది. సినిమా చాలా భాగం ఒకే లొకేషన్ లో జరుగుతుంది అని తెలిపారు.
సినిమాలోని నటీనటుల గురించి మాట్లాడుతూ.. నరేష్ అగస్త్య, ప్రిన్స్ బాగా చేసారు. ఈ రెండు పాత్రల మధ్య డైలాగ్స్ గ్రిప్పింగ్ గా ఉంటాయి. హీరోయిన్ గా నేహా కృష్ణన్ చేసింది. ఇందులో ఒక మంచి ప్రేమ కథ కూడా ఉంది. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి బల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. మహేశ్ విట్టా, అయ్యప్ప శర్మ గారు కూడా వాయిస్ ఓవర్స్ ఇచ్చారు అని తెలిపారు.
ముఖ్యంగా ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంది. సినిమాలో కలికి ఒక నివాసం చూపించాము. అది విజువల్ గా చాలా గ్రాండియర్ గా చూపించాము. పురాణాల్లోని కలి పురుషుడి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని ఈ కలి పాత్ర రాసుకుకొని సినిమా చేసాము ని తెలిపారు. మరి ఇటీవల మైథలాజి టచ్ తో వచ్చే సినిమాలు ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. ఈ కలి సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు అక్టోబర్ 2న చేయనున్నారు. ఈ ఈవెంట్ కు వరుణ్ తేజ్ గెస్ట్ గా రాబోతున్నారు.