Parineeti Chopra Wedding : చెల్లెలు పరిణీతి పెళ్లికి రాని అక్క ప్రియాంక చోప్రా.. కరుణ్ జోహోర్ సైతం..!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) లు వివాహా బంధంతో ఒక్కటి కావడానికి సిద్ధంగా ఉన్నారు.

Priyanka Chopra Skips Parineeti Wedding
Parineeti Chopra Raghav Chadha Wedding : బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) లు వివాహా బంధంతో ఒక్కటి కావడానికి సిద్ధంగా ఉన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహాం ఘనంగా జరుగుతోంది. వీరి వివాహానికి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. సానియా మీర్జా, హర్భజన్ సింగ్, మనీష్ మల్హోత్రా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.
అయితే పరిణీతి చోప్రాకు కజిన్ సిస్టర్ అయిన ప్రియాంక చోప్రా, ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ లు పెళ్లికి హాజరుకాలేదు. ఈ విషయం బాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. చెల్లి పెళ్లికి అక్క రాకపోవడానికి గల కారణాలపై నెటీజన్లు ఆరా తీస్తున్నారు. కాగా.. ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్తీ మేరీతో కలిసి పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహానికి హాజరవుతుందని నివేదికలు వచ్చాయి. అయితే.. ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడంతో ఆమె పెళ్లికి రావడం రావడం లేదని స్పష్టత వచ్చింది.
అయితే.. కాలిఫోర్నియాలోని బర్కిలీలో జరిగిన బంగ్లాదేశ్-అమెరికన్ ఆర్టిస్ట్ జై వోల్ఫ్ సంగీత కచేరీకి ప్రియాంక హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చెల్లి పెళ్లికి రాకుండా అక్కడకు వెళ్లడం ఎందుకు అని నెటీజన్లు ప్రియాంక తీరుపై మండిపడుతున్నారు.
కరుణ్ జోహార్ సైతం..
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహానికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన కరణ్ జోహార్ సైతం హాజరుకాలేదు. టైమ్స్ నౌలోని ఓ కథనం మేరకు కరణ్ జోహార్ పెళ్లికి వెళ్లేందుకు సిద్ధం అయ్యాడని, అయితే అనుకోని కారణాల వల్ల ఆగిపోయాడట. పరిణీతి చోప్రా వివాహానికి హాజరు అయ్యేందుకు కరణ్ పెద్ద ప్లానింగ్ చేసుకున్నాడట. పెళ్లి కోసం స్టైలిస్ డ్రెస్‌ను సైతం డిజైనింగ్ చేయించుకున్నాడట. అయితే.. అతడి కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా అతడు రాలేకపోయాడని తెలుస్తోంది.
Sreeleela : విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల డ్రాప్ అయ్యిందా..?