Bunny Vas : ఇప్ప‌టి నుంచి అయినా మ‌న వాయిస్ గ‌ట్టిగా వినిపించాలి.. నిర్మాత బ‌న్నీవాస్‌

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు అటు రాజ‌కీయ‌, ఇటు సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

Bunny Vas : ఇప్ప‌టి నుంచి అయినా మ‌న వాయిస్ గ‌ట్టిగా వినిపించాలి.. నిర్మాత బ‌న్నీవాస్‌

Producer Bunny Vas Reacts On Konda Surekha Comments

Updated On : October 3, 2024 / 4:03 PM IST

Bunny Vas – Konda Surekha : మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు అటు రాజ‌కీయ‌, ఇటు సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర దుమారాన్నిరేపుతున్నాయి. దీనిపై స్టార్ హీరోల నుంచి చిన్న న‌టీన‌టుల వ‌ర‌కు స్పందిస్తున్నారు. మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డుతున్నారు.

ఇక నిర్మాత బ‌న్నీవాస్ సైతం స్పందించారు. మనం గట్టిగా ప్రతిస్పందించక పోవడం.. మనం అవతలి వాళ్లకు సాఫ్ట్ టార్గెట్ అయ్యేలా చేస్తుందేమోన‌ని ఒక్క‌సారి ఆలోచించాల‌ని సినీ ప‌రిశ్ర‌మ‌ను కోరారు. ఇప్ప‌టి నుంచి అయినా మ‌న వాయిస్ గ‌ట్టిగా వినిపించాల‌న్నారు.

NTR : ‘దేవర’ రిలీజ్ తర్వాత.. ఎన్టీఆర్ కొత్త యాడ్ చూశారా..?

“ఆవేశంలో మాట జారుతాం. అలాంటి సందర్భంలో కూడా మాట అదుపులో పెట్టుకోవడమే ఉత్తమ వ్యక్తుల అత్యుత్తమ లక్షణం. ఒక ఉన్నత పదవిలో ఉన్నప్పుడు,ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా స్ఫూర్తిదాయకంగా వ్యవహరించే తీరు మన పెద్దల నుంచి మనం నేర్చుకోవాలి. ఇన్ని నిందలు, ఇన్ని ఆరోపణలు సినీ కుటుంబంపై పడుతున్నా కూడా.. మనం గట్టిగా ప్రతిస్పందించక పోవడం..మనం అవతలి వాళ్లకు సాఫ్ట్ టార్గెట్ అయ్యేలా చేస్తుందేమో ఒకసారి ఆలోచించండి..

ఏమన్నా కూడా వీళ్ళు ఏమనరు అని మనమే వాళ్లకు విమర్శించే అవకాశం ఇస్తున్నామేమో అనిపిస్తుంది. కనీసం ఇప్పటినుంచి అయినా సినీ కుటుంబం తరఫు నుంచి గట్టిగా మన వాయిస్ వినిపించే సమయం వచ్చిందేమో అని నా అభిప్రాయం… మనకు కూడా కుటుంబాలున్నాయి.. మనం కూడా మనుషులమే..మన మనసులు బాధపడతాయి.” అని బ‌న్నీవాస్ ట్వీట్ చేశారు.

Samyuktha – Konda Surekha : కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన హీరోయిన్..