Dil Raju mother : దిల్‌రాజు తల్లికి తీవ్ర అస్వస్థత.. ఐటీ అధికారుల వాహనంలోనే..
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో గత మూడు రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Producer Dil Raju mother hospitalized amid IT Raids
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు ఇంట్లో గత మూడు రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఐటీ సోదాలు జరుగుతుండగా.. దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఐటీ శాఖకు సంబంధించిన వాహనంలోనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. వారి వెంట ఐటీ శాఖకు చెందిన ఓ మహిళా అధికారి సైతం వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు తల్లికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఐటీ సోదాల్లో భాగంగా ఇప్పటికే దిల్‌రాజుతో పాటు అతడి భార్యను ఐటీ అధికారులు విచారించారు. బ్యాంక్ ఖాతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 55 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు దిల్ రాజు తో పాటు ఆయన కొడుకు శిరీష్, కూతురు హన్సీత రెడ్డి, బంధువుల ఇంట్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.
ఐటీ దాడులపై దిల్‌రాజు ఇప్పటికే స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదన్నారు. ఇండస్ట్రీ మొత్తం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయన్నారు. దిల్ రాజుతో పాటు మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఇటీవల దిల్‌రాజును తెలంగాణ ప్రభుత్వం నియమించింది. టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలతో కలిసి వెళ్లి ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వానికి సినీ పరిశ్రమ తరుపున అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పారు. ఇలాంటి తరుణంలో దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతపై ఐటీ దాడులు జరగడం రాజకీయాల్లో చర్చగా మారింది.
Director Om Ramesh krishna : మియాపూర్‌లో సినీ దర్శకుడు అదృశ్యం