Guntur Kaaram : ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ & టైం ఫిక్స్.. ఎక్కడంటే?

గుంటూరు కారం నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ & టైం పోస్ట్ చేసింది

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ & టైం ఫిక్స్.. ఎక్కడంటే?

Producer Naga Vamsi Reacted on Mahesh Babu Guntur Kaaram Movie Pre Release event

Updated On : January 8, 2024 / 7:50 PM IST

Guntur Kaaram : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం(Guntur Kaaram). ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడి, పలు అడ్డంకులు తట్టుకొని ఈ సంక్రాంతికి జనవరి 12న వస్తుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్, మూడు పాటలు కూడా రిలీజ్ చేశారు. నిన్న రాత్రి ట్రైలర్ రిలీజ్ చేయగా దానికి కూడా విపరీతమైన స్పందన వచ్చింది.

దీంతో గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎక్కువగా ప్రమోషన్స్ చేయట్లేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఒక్క ప్రెస్ మీట్ కానీ, ఇంటర్వ్యూ కానీ పెట్టలేదు, సినిమాకు కావాల్సినంత హైప్ మాత్రం ఉంది. అయితే డైరెక్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేద్దాం అనుకున్నారు చిత్రయూనిట్.

మొన్న జనవరి 6న గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని కూడా ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసి వాయిదా వేశారు. ఈ విషయంలో అభిమానులు మరోసారి నిరుత్సాహ పడ్డారు. దీంతో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా? ఉండదా? గుంటూరులో ఉంటుందా? హైదరాబాద్ లో ఉంటుందా అని అభిమానులు, నెటిజన్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

Also Read : ముంబైలో మంచు లక్ష్మి కొత్త ఇల్లు చూశారా? పూర్తిగా ముంబైకి మకాం మార్చేసిన లక్ష్మి మంచు..

తాజాగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ పై నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. సూపర్ ఫ్యాన్స్ సహనంగా వేచి ఉండండి. మేమే మీకు అధికారికంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ప్రకటిస్తాము. అందరూ సహకరించవలిసిందిగా కోరుతున్నాము అని పోస్ట్ చేసాడు. దీంతో మహేష్ అభిమానులు త్వరగా ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ప్రకటించమని అడుగుతున్నారు.

ఇది పోస్ట్ చేసిన కాసేపటికే గుంటూరు కారం నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ & టైం పోస్ట్ చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకని గుంటూరులోని నంబూరు ఎక్స్ రోడ్ వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బ్యాంకు పక్కనున్న ఖాళీ స్థలంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. రేపు జనవరి 9న సాయంత్రం 5 గంటల నుండి ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దీంతో గుంటూరుకి బాబు అభిమానులు భారీగా వెళ్ళడానికి సిద్ధమయ్యారు.