Producer SKN : ఏకంగా నలుగురు డైరెక్టర్స్‌తో నెక్స్ట్ సినిమాలు ప్లాన్ చేసిన బేబీ ప్రొడ్యూసర్.. స్పెషల్ ఫొటో షేర్ చేసి..

SKN ఇటీవల బేబీ లాంటి సూపర్ హిట్ సినిమా తీసి భారీ విజయం సాధించి స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు. మరో వైపు సినిమా ఈవెంట్స్ లో తన స్పీచ్ లతో బాగా వైరల్ అయి ఫ్యాన్స్ ని కూడా సంపాదించుకున్నారు.

Producer SKN : ఏకంగా నలుగురు డైరెక్టర్స్‌తో నెక్స్ట్ సినిమాలు ప్లాన్ చేసిన బేబీ ప్రొడ్యూసర్.. స్పెషల్ ఫొటో షేర్ చేసి..

Producer SKN announced his next four Films Directors

Updated On : October 13, 2023 / 7:18 AM IST

Producer SKN : మెగా ఫ్యాన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెలుగా సినీ పరిశ్రమలో ఎదిగి నిర్మాతగా మారారు SKN. ఇటీవల బేబీ లాంటి సూపర్ హిట్ సినిమా తీసి భారీ విజయం సాధించి స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు. మరో వైపు సినిమా ఈవెంట్స్ లో తన స్పీచ్ లతో బాగా వైరల్ అయి ఫ్యాన్స్ ని కూడా సంపాదించుకున్నారు. అంతకుముందు కూడా పలు సినిమాలు తీసినా బేబీ సినిమా సక్సెస్ నిర్మాత శ్రీనివాస్ కుమార్ కి ఫుల్ జోష్ ఇచ్చింది.

దీంతో మళ్ళీ యువ డైరెక్టర్స్ కే ఛాన్సులు ఇస్తూ మరిన్ని కొత్త కథలు తీసుకురావడానికి సిద్ధమయ్యారు SKN. తాజాగా తన నెక్స్ట్ సినిమాల డైరెక్టర్స్ ని ప్రకటించాడు SKN. తన నెక్స్ట్ నాలుగు సినిమాల డైరెక్టర్స్ తో కలిసి ఓ ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలో SKN తో పాటు కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్, బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్, మరో ఇద్దరు కొత్తవాళ్లు సుమన్ పాతూరి, రవి నంబూరి ఉన్నారు.

Also Read : Suma Kanakala : యాంకర్ సుమ తల్లి.. 82 ఏళ్ళ వయసులో ఎలా జిమ్ చేస్తున్నారో చూడండి..

ఈ నలుగురితోనే SKN నెక్స్ట్ నాలుగు సినిమాలు తీయనున్నారు. ఒక్క బేబీ ఇచ్చిన సక్సెస్ తో ఏకంగా నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు. మరి ఈ నాలుగు కూడా ఎలాంటి కథలతో వస్తాడో, బేబీ లాంటి హిట్ కొడతాడా చూడాలి.