Tickets Price Issue: ప్రొడ్యూసర్లు ఫుల్ ఖుష్.. ఇక కలెక్షన్లే కలెక్షన్లు?!

సినిమా ఇండస్ట్రీ సమస్యలు ఓ కొలిక్కి వస్తున్నాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్లతో కళకళలాడబోతోంది. ఇప్పటి వరకూ క్లారిటీలేని ధియేటర్లపై, ఎక్స్ ట్రా షోస్, టిక్కెట్ ప్రైస్ పై త్వరలోనే..

Tickets Price Issue: ప్రొడ్యూసర్లు ఫుల్ ఖుష్.. ఇక కలెక్షన్లే కలెక్షన్లు?!

Tollywood

Updated On : February 13, 2022 / 10:05 PM IST

Tickets Price Issue: సినిమా ఇండస్ట్రీ సమస్యలు ఓ కొలిక్కి వస్తున్నాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్లతో కళకళలాడబోతోంది. ఇప్పటి వరకూ క్లారిటీలేని ధియేటర్లపై, ఎక్స్ ట్రా షోస్, టిక్కెట్ ప్రైస్ పై త్వరలోనే ఓ క్లారిటీ రాబోతోంది. ఇన్నాళ్లూ ఈ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ.. సినిమాలు రిలీజ్ చెయ్యని నిర్మాతలు ఇప్పుడు మాకు మంచిరోజులొచ్చాయ్ అంటూ తెగ ఆనందపడిపోతున్నారు.

Star Heroins: స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌తో హీరోయిన్స్.. హీరోలతోనే పోటీ!

నిన్నటితో ఆంధ్రాలో రిలీజ్ డైలమాకి ఓ కన్ క్లూజన్ వచ్చిందని హ్యాపీ ఫీలవుతున్నారు నిర్మాతలు. ఈమధ్య తెలుగులో మ్యాగ్జిమమ్ స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే. 100..150 కోట్ల బడ్జెట్ లేనిదే ఏ స్టార్ హీరో సినిమా చెయ్యడం లేదు. అంత బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నప్పుడు కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో ఉండాలనుకుంటున్నారు నిర్మాతలు. ఆంధ్రాలో ఇప్పుడు ధియేటర్లు, టికెట్ రేట్ల ఇష్యూ సార్టవుట్ అవ్వడంతో తమ సినిమాలు సేఫ్ అనుకుంటున్నారు నిర్మాతలు.

Mohan Babu: జగన్, చంద్రబాబు ఇద్దరూ బంధువులే.. మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

సినిమాలు రిలీజ్ చెయ్యాలంటే.. ధియేటర్లు ఉండాలి.. ఆడియన్స్ రావాలి.. టిక్కెట్ రేట్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి. బెనిఫిట్ షో లతో, ఎక్స్ ట్రా షోలతో పాటు టికెట్ పెంచుకునే ఛాన్సుంటేనే సినిమాలకు డబ్బులొచ్చి లాభాలొస్తాయి. అందుకే ఇప్పటి వరకూ ట్రబుల్ చేసిన ఆంధ్రా టికెట్ రేట్స్, ధియేటర్ల ఇష్యూ ఓ కొలిక్కొచ్చింది. స్పెషల్లీ ట్రిపుల్ఆర్ టీమ్ అయితే ఫుల్ హ్యపీ ఫీలవుతోంది. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ట్రిపుల్ఆర్.. ధియేటర్ల ప్రాబ్లమ్ తోనే రిలీజ్ వాయిదా వేసుకుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే పరిస్తితులు ఉండడంతో రిలీజ్ జోష్ లో ఉన్నారు టీమ్.

Vishal: మరోసారి విశాల్‌కు గాయాలు.. యాక్షన్ సెంటిమెంట్ కలిసి వచ్చేనా?

ఒక వైపు పెరిగిపోతున్న సినిమా బడ్జెట్, మరోవైపు ఫైనాన్స్ తెచ్చిన డబ్బుకు వడ్డీలు.. ఇంతకష్టపడి సినిమా చేస్తే.. ధియేటర్లో బెనిఫిట్ షో స్, టిక్కెట్ రేట్ తక్కువగా ఉండడంతో సినిమాలు రిలీజ్ చెయ్యకుండా వెయిట్ చేస్తున్నారు. రాధేశ్యామ్ పరిస్తితి కూడా అంతే. ప్రభాస్ పాన్ ఇండియా వైడ్ గారిలీజ్ చేస్తున్న సినిమాకు కలెక్షన్లు చాలా ముఖ్యం. అందుకే 300కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు కలెక్షన్లు వచ్చే ఛాన్సుంటేనే రిలీజ్ చెయ్యడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు ధియేటర్ ఇష్యూ సెటిల్ అవ్వడంతో.. ఈసారి అనుకున్నడేట్ కే సినిమా రిలీజ్ అవుతుందని ఆనంద పడుతున్నారు ప్రొడ్యూసర్లు.

Aha OTT: తమిళంలో కూడా ఆహా.. గ్రాండ్‌గా లాంచింగ్!

నిన్న జరిగిన చిరంజీవి టీమ్ మీటింగ్ తో చార్జీలు పెంచుకునే ఛాన్సుంది.. బెన్ ఫిట్ షోలు వేసుకునే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి.. సినిమాలు రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా ఎప్పుడో రెడీ అయినా.. ఆంధ్రాలో ధియేటర్ల ఇష్యూ ఎప్పుడు సెటిల్ అయితే.. అప్పుడు రిలీజ్ చేస్తామన్న ప్రొడ్యూసర్లు..ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతున్నారు.

New Heroins: తెలుగు తెరపై కొత్త అందాలు.. స్టార్స్ అయ్యేది ఎవరో?

స్టార్ హీరో సినిమా అంటే క్రేజ్ ఉంటుంది ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటారు ప్రొడ్యూసర్లు. అందుకే బెనిఫిట్ షోస్ అరేంజ్ చేసి కలెక్షన్ల రేంజ్ పెంచుకుంటారు. అంతే కాదు ఫాన్స్ కోసం ఎక్స్ ట్రా షోస్ కూడా అరేంజ్ చేసి టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్సు కూడా ఉంటుంది. వీటన్నింటితోనే స్టార్ హీరో సినిమా కలెక్షన్లు ఈజీగా 15పర్సెంట్ పెరిగే ఛాన్సుంది. అంటే దాదాపు 10 నుంచి 20 కోట్ల వరకూ కలెక్షన్లు పెరిగుతాయి. పెద్ద సినిమాకి 15 కోట్లు గేమ్ చేంజర్ అవుతుంది కాబట్టి.. ఓవరాల్ రన్ కూడా పెరుగుతుంది. కాబట్టి సర్కారు వారి పాట, ఆచార్య, హరిహరవీరమల్లులాంటి భారీ బడ్జెట్ సినిమాల ప్రొడ్యూసర్లందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు.