Pushpa 2: బర్త్‌డే రోజున పుష్ప-2 నుండి సాలిడ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్న బన్నీ..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీ నుండి ఓ సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Pushpa 2: బర్త్‌డే రోజున పుష్ప-2 నుండి సాలిడ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్న బన్నీ..?

Pushpa 2 To Give A Solid Surprise On Allu Arjun Birthday

Updated On : April 7, 2023 / 4:34 PM IST

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుండి ఓ వీడియో గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో, ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Pushpa 2 : పుష్ప గ్లింప్స్ లో ఇది గమనించారా.. స్టోరీ ఇదేనా?

కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండటంతో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్స్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7న ఈ సినిమా నుండి ఓ సాలిడ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ అప్డేట్‌లో ఓ సర్‌ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్. ఈ సినిమాలో పలు భాషలకు చెందిన యాక్టర్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప-2లో ఓ బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Pushpa 2 : పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు.. గుడ్ న్యూస్ చెప్పిన సుకుమార్!

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పుష్ప-2 సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పుష్ప-2 వీడియో గ్లింప్స్‌లో మనకు రివీల్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్తలో నిజం ఉంటే మాత్రం.. పుష్ప-2 మూవీపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లడం ఖాయం. ఇప్పటికే పాన్ ఇండియా మూవీగా రాబోతున్న పుష్ప-2 మూవీలో ఇలా నార్త్, సౌత్ స్టార్ హీరోలు నటిస్తే, ఈ సినిమాను చూసేందుకు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తటం ఖాయమని పలువురు కామెంట్ చేస్తున్నారు.