AH Movie Song : ‘అ’ సినిమా నుంచి ఇదేనా ఇదేనా మెలోడీ సాంగ్ విన్నారా..
మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి..(AH Movie Song)
AH Movie Song
AH Movie Song : రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘అ’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేసారు. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కె, ఎడిటర్ గ్యారీ BH నిర్మాణంలో సాయి బాలి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా తాజాగా ఈ సినిమా నుంచి ‘ఇదేనా ఇదేనా..’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకత్వంలో సుమన్ చిక్కాల ఈ పాట రాయగా షణ్ముఖ భరద్వాజ్ పాడారు. మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి..
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో లిరిసిస్ట్ సుమన్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి పాట. శ్రీచరణ్ నాకు ఈ అవకాశం ఇచ్చి నాలోని పాటల రచయితను మీకు ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాడు అని తెలిపాడు. నిర్మాత గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ.. స్నేహితులు అందరం కలిసి ఈ సినిమా చేస్తున్నాం అని తెలిపారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. దర్శకుడు సాయి చూడటానికి సున్నితంగా ఉంటాడు కానీ ఈయన చేసిన క్రైమ్ థ్రిల్లర్ చూస్తే అందరూ షాక్ అవుతారు అని తెలిపారు.
దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ.. రాహుల్ విజయ్ ఎంతో క్రమశిక్షణ గల ఆర్టిస్ట్. నేను ఎంత ఇబ్బంది పెట్టినా సపోర్ట్ చేశాడు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాకు ఖర్చు పెట్టారు. సినిమాలో పాటలతో పాటు ఆర్ఆర్ కూడా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. టైటిల్ చుట్టు ఉన్న అమ్మాయి.. అదృశ్యం.. అన్వేషణ, అనుమానం.. అసాంఘీకం… అమానుషం ఈ పదాల మధ్యే ఈ కథ మొత్తం ఉంది. రాహుల్ విజయ్ను ఓ సీన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా ఈ సినిమాలో చూస్తారు అని తెలిపాడు. అర్చన అయ్యర్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్. నాకెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి మంచి పాత్ర చేయడం లక్కీగా ఫీలవుతున్నాను అని తెలిపింది.

రాహుల్ విజయ్ మాట్లాడుతూ.. ఈ పాటకు సంగీతం, సాహిత్యం, పిక్చరైజేషన్ అన్ని పర్ఫెక్ట్గా కుదిరాయి. డబ్బులంటే సరిపోదు. సినిమాపై ఎమోషన్ ఉండాలి. అలాంటి ఎమోషన్ ఉన్న నిర్మాతలు వీళ్లు. అక్టోబర్ 9న విడుదల కావాల్సిన ఈ సినిమాను బెటర్మెంట్ కోసం అక్టోబర్ 30న ఫర్ఫెక్ట్ ప్లాన్‌తో విడుదల చేస్తున్నాం. ‘అ’ మిస్టిరీయస్ ఇంట్రెస్టింగ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్‌గా మీ అందరికి థ్రిల్ల్‌ను పంచబోతుంది అని తెలిపారు.
