Purushothamudu : రిలీజ్‌కి సిద్దమవుతున్న రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’..
రీసెంట్ గా 'నా సామిరంగ' సినిమాలో నటించి అలరించిన రాజ్ తరుణ్.. ఇప్పుడు 'పురుషోత్తముడు'గా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Raj Tarun new movie Purushothamudu is getting ready for release
Purushothamudu : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. రీసెంట్ గా నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసి ఆడియన్స్ ని అలరించారు. ఇప్పుడు సోలో హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు ‘పురుషోత్తముడు’గా సిద్ధమవుతున్నారు. గత ఏడాది మేలో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకొని.. ఇప్పుడు రిలీజ్ కి సిద్దమవుతుంది.
ఈ చిత్రాన్ని రామ్ భీమన డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ డబ్బింగ్ పనులు మొదలు పెట్టింది. ఇక త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటిస్తామంటూ మూవీ టీం అనౌన్స్ చేసింది. శ్రీ శ్రీదేవి ప్రోడుక్షన్స్ బేనర్ పై డా.రమేశ్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కొత్త అమ్మాయి హాసిని సుధీర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
Also read : HanuMan : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో.. హనుమాన్ టీం.. పిక్ వైరల్
ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ముకేష్ ఖన్నా, రాజా రవీంద్ర, సత్య వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని సాంగ్స్ రిలీజ్ కాగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు.