Raj Tarun : రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. లావణ్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. అతన్ని తీసుకొనివస్తా అంటున్న లావణ్య

నిన్న రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేయగా నిన్న సాయంత్రం లావణ్యకే పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Raj Tarun : రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. లావణ్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. అతన్ని తీసుకొనివస్తా అంటున్న లావణ్య

Raj Tarun : హీరో రాజ్ తరుణ్ పై తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని లావణ్య అనే యువతి కేసు పెట్టింది. తనని పెళ్లి చేసుకోకుండా ఒక హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడని ఆరోపించింది. అయితే లావణ్య చేసిన ఆరోపణలపై స్పందిస్తూ రాజ్ తరుణ్ .. గతంలో కొన్నాళ్ళు లావణ్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను కానీ ఆమె వ్యవహారశైలి నచ్చక బయటకు వచ్చేసాను. ఆమె డ్రగ్స్ వాడేది. మానేయమని ఎన్నిసార్లు చెప్పినా లావణ్య వినలేదు. అంతేకాక మస్తాన్ సాయి అనే యువకుడితో లావణ్య రిలేషన్ లో ఉంది అని అన్నాడు.

నిన్న రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేయగా నిన్న సాయంత్రం లావణ్యకే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని, 91 crpc కింద నోటీసులు జారీ చేసారు పోలీసులు. కానీ ఇప్పటివరకు పోలీసులకు లావణ్య అందుబాటులోకి రాలేదని సమాచారం.

Also Read : Comedian Satya : కమెడియన్ సత్య ‘అమృతం’ సీరియల్ లో ఉన్నాడని తెలుసా?

అయితే లావణ్య మరోసారి రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేస్తూ.. రాజ్ తరుణ్ తనతోనే కాకుండా మరికొంత మంది అమ్మాయిలతో రిలేషన్ లో ఉన్నాడని, నా మీద రాజ్ తరుణ్ చేసిన ఆరోపణలు అబద్ధాలని, రాజ్ తరుణ్ బండారాన్ని ఆధారాలతో సహా బయట పెడతాను అని తెలిపింది. అలాగే రాజ్ తరుణ్ చెప్తున్న మస్తాన్ అనే వ్యక్తిని తీసుకొని మీడియా ముందుకు వస్తాను అంటుంది. ఇక రాజ్ తరుణ్.. లావణ్య పిర్యాదు పై విచారణకు నార్సింగ్ పోలీసులు పిలుస్తే వచ్చి తన వర్షన్ చెబుతాను అని తెలిపాడు. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.