Athreyapuram Brothers : ‘ఆత్రేయపురం బ్రదర్స్’.. కొత్త సినిమా ఓపెనింగ్..

డైరెక్టర్ రాజేష్ జగన్నాధం తాజాగా తన కొత్త సినిమాని మొదలుపెట్టారు. (Athreyapuram Brothers)

Athreyapuram Brothers : ‘ఆత్రేయపురం బ్రదర్స్’.. కొత్త సినిమా ఓపెనింగ్..

Athreyapuram Brothers

Updated On : January 21, 2026 / 7:59 PM IST

Athreyapuram Brothers : వరుణ్ సందేశ్ నింద సినిమా ఫేమ్ డైరెక్టర్ రాజేష్ జగన్నాధం తాజాగా తన కొత్త సినిమాని మొదలుపెట్టారు. రాజీవ్ కనకాల, గవిరెడ్డి శ్రీనివాస్, సన్నీ పత్సా, రఘు బాబు, గీత్ సైని, నేహా పఠాన్, సిద్దార్థ్ గొల్లపూడి.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ‘ఆత్రేయపురం బ్రదర్స్’. S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె నిర్మాణంలో ఈ కొత్త సినిమా మొదలయింది.(Athreyapuram Brothers)

నేడు ఆత్రేయపురం బ్రదర్స్ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్స్ వశిష్ట, అనుదీప్, ఆదిత్య హాసన్, ప్రవీణ్ కాండ్రేగుల, విజయ్ కనకమేడల గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టైటిల్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.

Also Read : Vishal : విశాల్ – తమన్నా కొత్త సినిమా అనౌన్స్.. గ్లింప్స్ భలే ఉందే.. మొగుడు మొగుడిలా ఉండాలి…

athreyapuram brothers

ఈ పోస్టర్ లో ఏ స్వీట్ రైవల్రీ అనే ట్యాగ్ లైన్ తో ఇద్దరు వ్యక్తులు బల పరీక్ష చేసుకుంటున్నట్లుగా ఉంది. దీంతో ఇది ఆత్రేయపురం బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న ఇద్దరు బ్రదర్స్ కథ అని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

Also Read : Krithi Shetty : బెడ్ రూమ్ లో కృతిశెట్టి హాట్ పోజులు.. ఫోటోలు వైరల్..