Rajeev Khandelwal : నేను క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే.. బాలీవుడ్ న‌టుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మ‌హిళ‌లే కాకుండా పురుషులు కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొంటార‌ని ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు రాజీవ్ ఖండేల్వాల్(Rajeev Khandelwal ) అన్నారు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినేని చెప్పారు.

Rajeev Khandelwal : నేను క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే.. బాలీవుడ్ న‌టుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Rajeev Khandelwal

Updated On : June 23, 2023 / 8:18 PM IST

Actor Rajeev Khandelwal : మ‌హిళ‌లే కాకుండా పురుషులు కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొంటార‌ని ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు రాజీవ్ ఖండేల్వాల్(Rajeev Khandelwal ) అన్నారు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినేని చెప్పారు. త‌న కెరీర్‌లో ఓ సారి త‌న‌కు ఇలాంటి చేదు అనుభ‌వం ఎదురైన‌ట్లు తెలిపాడు. ఆ స‌మ‌యంలో తాను ఎలాంటి త‌డ‌బాటుకు గురి కాలేద‌న్నాడు. వెంట‌నే.. సారీ బాస్‌, మీరు చెప్పిన‌ట్లు నేను చేయ‌లేను అని చెప్పి అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన‌ట్లు వెల్ల‌డించాడు. అయితే.. మ‌గ‌వాళ్లు ఇలాంటి ప‌రిస్థితులను డీల్ చేసినంత‌గా మ‌హిళ‌లు చేయ‌లేర‌న్నాడు.

Kushboo : మరోసారి ఆసుపత్రిలో చేరిన నటి కుష్బూ.. ‘ఈసారైనా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్!

కొన్ని సార్లు అమ్మాయిలు ప‌రిస్థితులకు త‌లొగ్గి త‌మ‌లో తామే కుమిలిపోతార‌న్నారు. అయితే.. అబ్బాయిలు మాత్రం వాటికి ఎదురునిల‌బ‌డి ముందుకు సాగుతార‌ని, అయితే.. ఆ విష‌యాల‌ను బ‌య‌ట‌కు మాత్రం చెప్ప‌ర‌న్నాడు. సినీ ఇండ‌స్ట్రీలో ఎప్పుడు చూసిన మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోస‌మే మాట్లాడతార‌ని మ‌గ‌వాళ్ల‌కు ర‌క్ష‌ణ గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని తెలిపాడు. పురుషాదిప‌త్యం వ‌ల్ల అమ్మాయిలే ఎక్కువ‌గా న‌లిగిపోతున్నార‌న్నాడు. అందువ‌ల్ల వారి ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపించ‌డంలో త‌ప్పులేద‌న్నాడు. అయితే.. సినీ ప‌రిశ్ర‌మ ఇంత‌కు ముందులా లేద‌ని, చాలా మారింద‌న్నాడు.

Bhola Shankar : భోళా శంకర్ మూవీ టీజర్ లాంచ్.. థియేట‌ర్ల లిస్ట్ ఇదే..

బుల్లితెర న‌టుడిగా కెరీర్ ప్రారంభించాడు రాజీవ్ ఖండేల్వాల్. ఆ త‌రువాత బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ‘టేబుల్ 21’, ‘సౌండ్ ట్రాక్‌’, ‘సైతాన్‌’, ‘సామ్రాట్ అండ్ కో’ వంటి చిత్రాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఓటీటీల్లోనూ స‌త్తా చాటాడు. కేవ‌లం యాక్ట‌ర్‌గానే కాకుండా యాంక‌ర్‌గానూ త‌న‌దైన ముద్ర వేశాడు. ఇటీవల షాహిద్ కపూర్,డయానా పెంటీ నటించిన ‘బ్లడీ డాడీ’లోనూ అల‌రించాడు.