CP Sajjanar: ఆహార కల్తీ హత్యాయత్నమే.. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు- సీపీ వార్నింగ్
ఆహార కల్తీని నియంత్రించడమే లక్ష్యంగా ఈ బృందాలు పని చేయనున్నాయి. వ్యాపారులు కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తేల్చి చెప్పారు. CP Sajjanar
CP Sajjanar Representative Image (Image Credit To Original Source)
- ఆహారాన్ని కల్తీ చేస్తే కఠిన చర్యలు
- పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వార్నింగ్
- ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పోలీసులు సోదాలు
CP Sajjanar: హైదరాబాద్ లో ఆహార కల్తీపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. నగరంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి సోదాలు చేస్తామన్నారు. ఆహారాన్ని కల్తీ చేయడం హత్యాయత్నమే అని సీపీ సజ్జనార్ అన్నారు. కల్తీ ఫుడ్ పై సమాచారం కోసం త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు పోలీసులు. అందులో భాగంగా సీపీ సజ్జనార్ వివిధ శాఖల అధికారులతో ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగి హైదరాబాద్ నగరంలో సోదాలు జరపనున్నారు. ఆహారాన్ని కల్తీ చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నారు.
ఆహార కల్తీని నియంత్రించడమే లక్ష్యంగా ఈ బృందాలు పని చేయనున్నాయి. వ్యాపారులు కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తేల్చి చెప్పారు. కల్తీ చేస్తే పదే పదే పట్టుబడితే ఆ వ్యాపారుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు వారి మీద పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన అధికారులు నగరంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా రంగంలోకి దిగనున్నారు. నగరంలో కల్తీ ఆహార పదార్దాలను నియంత్రించేందుకు ఈ కమిటీ పని చేయనుంది.
Also Read: కొత్త పార్టీ ఏర్పాటుపై కసరత్తు స్పీడప్ చేసిన కవిత.. ఆ నెలలోనే పార్టీ ప్రారంభం..! ఎందుకంటే?
