రజనీకాంత్ కొత్త ప్రాజక్ట్ పై అప్ డేట్

  • Published By: veegamteam ,Published On : March 27, 2019 / 08:06 AM IST
రజనీకాంత్ కొత్త ప్రాజక్ట్ పై అప్ డేట్

Updated On : March 27, 2019 / 8:06 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు 70 ఏళ్లకు చేరువవుతున్నా ఏ మాత్రం అలుపు లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. అయన ‘పేట’ సినిమాతో ఇటీవల మంచి హిట్‌ అందుకున్నారు. తాజాగా ఆయ‌న స్టార్ డైరెక్ట‌ర్ AR మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ ఎప్పుడో వచ్చిన పలు కారణాలతో ఇంత‌వ‌ర‌కు ఈ చిత్రాన్ని సెట్స్ పైకి వెళ్ళ‌లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 10 నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
Read Also : ‘మహర్షి’ మ్యూజికల్ జర్నీ

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ‌రోసారి ర‌జ‌నీకాంత్ చిత్రానికి స్వ‌రాలు అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నుంది. 

అంతేకాదు చాలా ఏళ్ల తర్వాత ఈ మూవీలో రజనీకాంత్ మళ్లీ ఖాకీ దుస్తుల్లో కనిపిస్తున్నారని టాక్ వచ్చింది. రజనీకాంత్ సినిమా అంటేనే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుంది. అందులోనూ ఏఆర్ మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్ తీస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
Read Also : నాకు బతకడమే ఓ కల : 28న ఐరా