Rajinikanth: రజనీ తదుపరి సినిమా.. కూతురుతోనా.. అల్లుడితోనా?
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోగా చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కమర్షియల్ మాస్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రజనీతో చాలా సంవత్సరాల తర్వాత నయనతార జోడీ కట్టింది.

Rajinikanth
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోగా చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కమర్షియల్ మాస్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రజనీతో చాలా సంవత్సరాల తర్వాత నయనతార జోడీ కట్టింది. కాగా.. ఈ సినిమా తర్వాత రజనీ ప్రస్తుతం కొత్తగా సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు.
ఈ మధ్యనే ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన రజనీ శుక్రవారం చెన్నైకి తిరిగి వచ్చారు. కాగా, ఇప్పుడు తదుపరి సినిమాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రజినీకాంత్ తదుపరి సినిమా కోసం ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు కథలు వినిపించినా ఎవరికీ ఒకే చెప్పలేదట. అయితే, ఆయన కూతురు సౌందర్య కూడా ఓ స్క్రిప్ట్ రెడీ చేయగా తలైవా తన తర్వాతి సినిమా కూతురు డైరెక్షన్‌లోనే ఉండనుందని ప్రచారం జరుగుతూ వచ్చింది. బహుశా ఇదే ఆయన చివరి సినిమా కావచ్చని.. ఈ సినిమా తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకోనున్నారని ప్రచారం జరుగుతుంది.
కానీ, తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ చేసే చివరి చిత్రం అల్లుడు ధనుష్ డైరెక్షన్‌లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ని రజనీకాంత్ ఇద్దరు కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య నిర్మించనుండగా అల్లుడు ధనుష్ తెరకెక్కించనున్నాడని మీడియా వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరోవైపు ప్రస్తుతం నటిస్తున్న అన్నాత్తే సినిమా తర్వాత దేశింగ్ పెరియసమి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని.. ఆ తర్వాత ధనుష్ దర్శకత్వంలో చివరి సినిమా చేయనున్నాడని కూడా చెప్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో చూడాలి!