Rajinikanth : ‘స్వామీజీ చెప్పారు.. జైల‌ర్ హిట్ అయిన‌ట్టే లెక్క‌..’ ర‌జినీకాంత్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ రజినీకాంత్‌(Rajinikanth)కు దైవ చింత‌న ఎక్కువ. ఆయ‌న అప్పుడప్పుడు హిమాల‌యాల‌కు వెళ్లి వ‌స్తుంటారు అన్న సంగ‌తి తెలిసిందే.

Rajinikanth : ‘స్వామీజీ చెప్పారు.. జైల‌ర్ హిట్ అయిన‌ట్టే లెక్క‌..’ ర‌జినీకాంత్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

Rajinikanth visits badrinath temple

Updated On : August 13, 2023 / 5:51 PM IST

Rajinikanth visits Badrinath Temple : కోలీవుడ్ సూప‌ర్ స్టార్ రజినీకాంత్‌(Rajinikanth)కు దైవ చింత‌న ఎక్కువ. ఆయ‌న అప్పుడప్పుడు హిమాల‌యాల‌కు వెళ్లి వ‌స్తుంటారు అన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఆయ‌న ఆధ్మాత్మిక యాత్ర‌కు బ‌య‌లుదేరారు. హిమాల‌యాల‌కు వెళ్లిన ర‌జినీకాంత్ ఆదివారం తెల్ల‌వారుజామున ఉత్త‌రాఖండ్‌లోని బ‌ద్రీనాథ్ ఆల‌యాన్ని(Badrinath Temple) సంద‌ర్శించారు. ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ఆల‌య ప్రాంగ‌ణంలో అభిమానుల‌కు అభివాదం చేశారు. ఆ త‌రువాత‌ కాసేపు వారితో ముచ్చ‌టించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Aaradhya Bachchan : ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య ఇప్పుడు ఎలా ఉందో చూశారా? ఎంత పెద్దదైపోయింది

రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్’(Jailer). ఈ సినిమా ఆగస్టు 10న విడుద‌లైంది. ముత్తు అలియాస్ ముత్తువేల్ పాండ్య‌న్ అనే రిటైర్డ్ పోలీస్ అధికారి పాత్రలో ర‌జినీకాంత్ ఇర‌గ‌దీశారు. త‌మ‌న్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, సునీల్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుద‌లైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.220 కోట్లకు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధించింది. అంటే ఆల్మోస్ట్ షేర్ రూ.110 కోట్లపైనే కలెక్ట్ చేసింది. ఇప్ప‌టికే చాలా చోట్ల ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వ‌చ్చేసింది.

Rajinikanth visits badrinath temple

Rajinikanth visits badrinath temple

Top music director : సౌత్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ అత‌డేనా..? సినిమాకి రూ.10కోట్లు..?

ఇదిలా ఉంటే.. రిషికేష్‌లోని స్వామి ద‌యానంద గురూజీ ఆశ్ర‌మాన్ని శ‌నివారం ర‌జినీకాంత్ సంద‌ర్శించారు. అనంత‌రం ఆయ‌న‌ మాట్లాడుతూ.. ‘ఎన్నో అంచనాల మధ్య జైలర్‌ సినిమా విడుదలైంది. కంగారుపడొద్దు. సినిమా తప్పకుండా విజయం అందుకుంటుంది’ అని స్వామీజీ చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు. స్వామీజీయే స్వ‌యంగా ఆ మాట చెప్పారంటే త‌ప్ప‌కుండా జైల‌ర్ సినిమా హిట్ అయిన‌ట్టే అని ర‌జినీకాంత్ అన్నారు. కాగా.. ర‌జినీకాంత్ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

Rajinikanth visits badrinath temple

Rajinikanth visits badrinath temple