Raju Gaani Savaal : ‘రాజు గాని సవాల్’ ట్రైలర్ రిలీజ్..
మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..

Raju Gaani Savaal
Raju Gaani Savaal : లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రాజు గాని సవాల్’. లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు. ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశీ సింగ్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్, ప్రొడ్యూసర్స్ దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్, గీత రచయిత గోరటి వెంకన్న, నటుడు డా.భద్రం గెస్టులుగా హాజరయ్యారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..
Also Read : Sudheer – Pradeep : చాన్నాళ్లకు కలిసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్న సుధీర్ – ప్రదీప్.. ప్రోమో వైరల్..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ.. నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో కలిసిన సినిమా మీద ప్రేమ ఉన్న ముగ్గురు వ్యక్తులు బాపిరాజు గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు. ఈ అమ్మాయి బాగుంటుందని నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చారు ఈ ముగ్గురు. అందుకే వారి కోసం ఈ ఈవెంట్ కి వచ్చాను అని తెలిపింది. హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కు వచ్చే ముందే రాజు గాని సవాల్ ట్రైలర్ చూశాను చాలా బాగుంది. బాపిరాజు గారి నమ్మకాన్ని ఈ మూవీ నిలబెట్టాలి అని అన్నారు.

నటుడు డాక్టర్ భద్రం మాట్లాడుతూ.. రాజు గాని సవాల్ సినిమాకు దర్శకత్వం, నిర్మాత, హీరోగా మూడు పాత్రలు పోషిస్తున్నారు రవీందర్ గారు. వీటిలో ఒక బాధ్యత నిర్వర్తించడమే కష్టం అని అన్నారు. దర్శక నిర్మాత, హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ.. మా జీవితాల్లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తీస్తున్నాం. కవాడిగూడ రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. మధ్య తరగతి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. అలాంటి సందర్భంలో ఒక పెద్ద సమస్య ఎదురైతే ఆ మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమాలో చూస్తారు అని తెలిపారు.
Also Read : Kingdom : హిందీలో మరో పేరుతో రిలీజ్ అవ్వబోతున్న విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’.. బాలీవుడ్ టైటిల్ ఏంటో తెలుసా?
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ.. ఇక్కడకు వచ్చిన వాళ్లంతా నా మీద అభిమానంతో ఫోన్ లో మాట్లాడి అడగగానే వచ్చారు. రాజు గాని సవాల్ సినిమా ఘనంగా రిలీజ్ అయ్యి కాసుల వర్షం కురిపిస్తుందని నమ్ముతున్నాం. హీరో రవీందర్ గారు నాకు మూవీ ఇవ్వకుంటే ఈ రోజు ఈ వేదిక మీద నిలబడి మాట్లాడే అవకాశం వచ్చేది కాదు అని అన్నారు.