Rakhi Sawant : నాకు కేవలం ముద్దు, అత్యాచార సీన్లు మాత్రమే ఇస్తున్నారు.. నేను మంచి నటిని, మంచి పాత్రలు ఇవ్వండి..

రాఖీ సావంత్‌ మీడియాతో మాట్లాడుతూ... ''నన్ను ట్రోల్ చేసే వాళ్ళని చేయనివ్వండి. నేనేం పట్టించుకోను. నేను అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తున్నా. ఎక్స్‌పోజింగ్‌ ఆపి వెళ్లి ఇంట్లో కూర్చోమని చాలా మంది అంటారు. కానీ నేను బాలీవుడ్‌లో ఎక్కువరోజులు ఉండటానికే......

Rakhi Sawant : నాకు కేవలం ముద్దు, అత్యాచార సీన్లు మాత్రమే ఇస్తున్నారు.. నేను మంచి నటిని, మంచి పాత్రలు ఇవ్వండి..

Rakhi Sawant

Updated On : July 23, 2022 / 7:56 AM IST

Rakhi Sawant :  బాలీవుడ్ డ్యాన్సర్, నటి రాఖీ సావంత్ ఎప్పుడూ ఎదో ఒక విధంగా మీడియాలో నిలుస్తుంది. గతంలో తన మాజీ భర్త రితేష్ సింగ్ తో గొడవలు, విడిపోవడం, మోసం చేశాడని.. ఇలా చాలా రోజులు వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత కొత్త ప్రియుడు అదిల్‌ దురానీతో లవ్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తూ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇక రాఖీ సావంత్ ఐటెం సాంగ్స్, కిస్ సీన్స్ లో ఎక్కువగా నటిస్తుంది. రాఖీ సావంత్‌ డ్రెస్సింగ్ ని, ఆమెని సోషల్ మీడియాలో నెటిజన్లు అప్పుడప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు. అయితే తన పర్సనల్ గొడవలతో ఈ మధ్య తనకి వచ్చే ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. తాజాగా మీడియాతో మాట్లాడుతూ నాకు మంచి పాత్రలు ఇవ్వండి అని అభ్యర్థిస్తుంది.

Sree Vishnu : తీవ్ర అస్వస్థతో హాస్పిటల్‌లో జాయిన్ అయిన హీరో శ్రీ విష్ణు..

రాఖీ సావంత్‌ మీడియాతో మాట్లాడుతూ… ”నన్ను ట్రోల్ చేసే వాళ్ళని చేయనివ్వండి. నేనేం పట్టించుకోను. నేను అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తున్నా. ఎక్స్‌పోజింగ్‌ ఆపి వెళ్లి ఇంట్లో కూర్చోమని చాలా మంది అంటారు. కానీ నేను బాలీవుడ్‌లో ఎక్కువరోజులు ఉండటానికే అలా రెడీ అవుతాను. పొట్టి బట్టలు, చర్మం కనిపించేలా దుస్తులు ధరించడం వల్లే నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. వాటితో పాటు నేను బాగా కష్టపడతాను కాబట్టే ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఉండగలిగాను. ప్రస్తుతం కొన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు చేస్తున్నాను. కానీ నా ఇమేజ్‌ను చూసి నాకు కేవలం అత్యాచార సన్నివేశాలు, ముద్దు సీన్స్ మాత్రమే ఇస్తున్నారు. నాకు ఇది నచ్చట్లేదు. నేను కేవలం ముద్దు, రేప్‌ సీన్లలో మాత్రమే ఎందుకు నటించాలి. నేను మంచి డ్యాన్సర్‌ను అని అందరికి తెలుసు. ఇంతకుముందు చాలా ఐటం సాంగ్స్‌ కూడా చేశాను. అలాగే మంచి నటిని కూడా, నా నటనను నిరూపించుకునేందుకు ఒక్క మంచి ఛాన్స్‌ ఇవ్వండి. మంచి పాత్రలు ఇస్తే నా నటన ఏంటో చూపిస్తా. నాకు సరైన పాత్రలు ఇవ్వట్లేదు కాబట్టే ఇలా మీడియా ముందుకు రావాల్సి వస్తుంది” అంటూ తనకి బాలీవుడ్ లో మంచి క్యారెక్టర్స్ ఇవ్వమని అడుగుతుంది. మరి ఈ ప్రెస్ మీట్ చూసైనా బాలీవుడ్ వాళ్ళు రాఖీ సావంత్‌ కి మంచి పాత్రలు ఇస్తారేమో చూడాలి.