Rakul Preet Singh : ప్రతిసారి పెళ్లి గురించి అడగకండి.. చెప్పాల్సిన అవసరం లేదు..
పెళ్లి గురించి ప్రశ్నించగా ఈ సారి కొంచెం సీరియస్ గానే సమాధానమిచ్చింది రకుల్. పెళ్లి ప్రశ్నకి సమాధానమిస్తూ.. ''ఇది చాలా సాధారణ విషయం. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే.............

Rakul
Rakul Preet Singh : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి బాలీవుడ్ కి చెక్కేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం రకుల్ చేతిలో దాదాపు అరడజను పైగా బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఇక అక్కడే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది ఈ యాపిల్ బ్యూటీ. జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్ల క్రితమే అధికారికంగా సోషల్ మీడియాలో తెలిపింది. ఇక అప్పట్నుంచి మీడియా, అభిమానులు, నెటిజన్లు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతూనే ఉన్నారు.
మొదట్లో ఈ ప్రశ్న అడిగిన ప్రతి సారి ఇప్పుడే చేసుకోము, చేసుకుంటే చెప్తాము అంటూ సమాధానాలిచ్చేది. అయినా వరుసగా మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి ఈ ప్రశ్న కచ్చితంగా తారసపడుతుంది. ఇటీవల బాలీవుడ్ లో ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పెళ్లి గురించి ప్రశ్నించగా ఈ సారి కొంచెం సీరియస్ గానే సమాధానమిచ్చింది రకుల్.
BiggBoss Non Stop : నా ఇంటికి వచ్చేసాను.. బిగ్‌బాస్‌లో బాబా భాస్కర్ వైల్డ్ కార్డు ఎంట్రీ..
పెళ్లి ప్రశ్నకి సమాధానమిస్తూ.. ”ఇది చాలా సాధారణ విషయం. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే. అమ్మ, నాన్న, తమ్ముడు ఎలా ఉంటారో జీవిత భాగస్వామి కూడా ప్రతి మనిషికి ఉంటారు. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడటం అనవసరం. దయచేసి ఇలా ప్రతిసారి అడగొద్దు. మా బంధం గురించి ఏదైనా చెప్పాల్సి వస్తే నేనే స్వయంగా చెప్తాను. అంతే గాని ఇలా ప్రతి ఇంటర్వ్యూలోనూ తన గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు’’ అని రకుల్ కొంచెం ఘాటుగానే చెప్పింది. రకుల్ ఎంత ఘాటుగా చెప్పినా మన వాళ్ళు వదులుతారా కచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఈ ప్రశ్నని అడుగుతూనే ఉంటారు ప్రభాస్ ని అడిగినట్టు.