Klin Kaara : ‘క్లిన్ కారా’కు అప్పుడే ఆరు నెలలు.. ముంబై మహాలక్ష్మి ఆలయంలో చరణ్ దంపతులు..

తాజాగా క్లిన్ కారాకు ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంగా చరణ్ దంపతులు తమ పాప క్లిన్ కారాతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు.

Klin Kaara : ‘క్లిన్ కారా’కు అప్పుడే ఆరు నెలలు.. ముంబై మహాలక్ష్మి ఆలయంలో చరణ్ దంపతులు..

Ram Charan and Upasana visited Mumbai Mahalakshmi Temple for Completing six months of Klin Kaara

Updated On : December 20, 2023 / 1:51 PM IST

Klin Kaara : కొన్ని నెలల క్రితం చరణ్ దంపతులకు పాప పుట్టిన సంగతి తెలిసిందే. పాపకు ‘క్లిన్ కారా’ అని పేరు పెట్టారు. క్లిన్ కారా పుట్టిన దగ్గర్నుంచి వైరల్ అవుతూనే ఉంది. మెగా లిటిల్ ప్రిన్సెస్ గా అభిమానులు ఆమె గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు కూడా పాప ఫోటో కనిపించకుండా చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అభిమానులు ఏమో క్లిన్ కారా ఫేస్ ని ఎప్పుడు చూపిస్తారో అని ఎదురు చూస్తున్నారు.

ఇటీవల చరణ్ దంపతులు ముంబై వెళ్లారు. క్లిన్ కారాని ఎత్తుకొని చరణ్ ఇంట్లోకి వెళ్తున్న వీడియో కొన్ని రోజుల క్రితమే వైరల్ గా మారింది. జూన్ 20న క్లిన్ కారా పుట్టింది. తాజాగా క్లిన్ కారాకు ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంగా చరణ్ దంపతులు తమ పాప క్లిన్ కారాతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Also Read : Salaar Interview : రాజమౌళితో సలార్ స్పెషల్ ఇంటర్వ్యూ వచ్చేసింది.. ఫుల్ ఇంటర్వ్యూ చూశారా?

చరణ్, ఉపాసన తమ పాప క్లిన్ కారాతో పాటు పాపని చూసుకునే నానీ, చరణ్ స్టాఫ్ కూడా వెళ్లారు. ఆలయం వద్ద చరణ్ తో ఫోటోలు దిగడానికి అభిమానులు ఆసక్తి చూపించారు. ఇక ఇక్కడ కూడా పాప ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు ఈ జంట. ప్రస్తుతం చరణ్ దంపతులు గుడికి వెళ్లి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.