Dhruva – Agent : సురేందర్ రెడ్డి సినిమాటిక్ యూనివెర్స్.. చరణ్ అండ్ అఖిల్ సినిమా?
రామ్ చరణ్ ధృవ, అఖిల్ ఏజెంట్ తో సురేందర్ రెడ్డి సినిమాటిక్ యూనివర్స్.. అఖిల్ చేసిన పోస్ట్ వైరల్.

Ram Charan Dhruva Akhil Agent Surender Reddy cinematic universe
Dhruva – Agent : టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, అక్కినేని అఖిల్ (Akkineni Akhil) కలయికలో వస్తున్న చిత్రం ఏజెంట్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీకి స్టార్ రైటర్ వక్కంతం వంశీ కథని అందిస్తున్నాడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఒక ముఖ్య పాత్ర చేస్తుండగా సాక్షి వైద్య (Sakshi Vaidhya) హీరోయిన్ గా డెబ్యూట్ ఇస్తుంది. తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిజా మ్యూజిక్ ఇస్తున్నాడు. ఏప్రిల్ 28న మూవీ తెలుగు మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో ఉన్న చిత్ర యూనిట్ తాజాగా ఒక వీడియో పోస్ట్ చేసింది.
Agent – Custody : ఏజెంట్, కస్టడీ చిత్రాల విజయం కోసం.. తిరుమలకు నాగార్జున, అమల..
ఆ వీడియోలో రామ్ చరణ్ (Ram Charan) ధృవ థీమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లే అవుతుంటే.. చరణ్ ని బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నారు. వీడియో ఎండ్ లో చరణ్.. “ఏజెంట్ ఎక్కడ ఉన్నావు” అన్న డైలాగ్ చెప్పాడు. ఇక ఈ వీడియో పోస్ట్ చేస్తూ వేచి ఉండండి అంటూ చెప్పుకొచ్చారు. కాగా గతంలో సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ కాంబినేషన్ లో ధృవ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ సీక్వెల్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ధృవ 2 పై చర్చలు జరుగుతున్నాయి అని కూడా గతంలో తెలియజేసిన విషయం తెలిసిందే.
Ram Charan : ఉపాసన డెలివరీ అయ్యేవరకు చరణ్ షూటింగ్స్ కు బ్రేక్ ఇస్తాడా??
ఇక ప్రస్తుతం సినిమాటిక్ యూనివెర్స్ ట్రెండ్ నడుస్తున్న సమయంలో ఈ వీడియో పోస్ట్ అందరిలో ఇంటరెస్ట్ ని కలగజేస్తుంది. మరి ఇది ప్రమోషన్ లో ఒక భాగమా? లేదా నిజంగా ధృవ అండ్ ఏజెంట్ ని కంబైన్ చేసే సినిమాటిక్ యూనివర్స్? తెలియాలి అంటే మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సిందే.
Stay tuned…. #Dhruva x #Agent. #AGENTonApril28th pic.twitter.com/QJOenBa3h2
— Akhil Akkineni (@AkhilAkkineni8) April 26, 2023