Ram Charan : రామ్ చరణ్, సుకుమార్ RC17 ప్రకటన.. రాజమౌళి కామెంట్స్ వైరల్..
రామ్ చరణ్, సుకుమార్ RC17 ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో.. అభిమానులంతా రాజమౌళి వీడియోని వైరల్ చేస్తున్నారు.

Ram Charan fans trending rajamouli comments about RC17 movie
Ram Charan : రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురు చూస్తున్న చిత్రం దర్శకుడు సుకుమార్ తో చేయబోయే సినిమా. ‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్టుని నమోదు చేయడమే కాకుండా.. టాలీవుడ్ లో రా అండ్ రస్టిక్ సినిమాలకు ఒక కిక్ స్టార్ట్ అయ్యారు. ఈ సినిమా అందుకున్న హిట్టు వలనే పుష్ప, దసరా వంటి సినిమాలు కూడా ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాయి.
రామ్ చరణ్ కి కూడా ఈ సినిమా ఓ ల్యాండ్‌మార్క్ అయ్యింది. అంతకుముందు పలు బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్ ఉన్నాగాని.. యాక్టింగ్ విషయంలో రామ్ చరణ్ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటు వచ్చారు. వాటన్నిటికీ ఈ సినిమాతో రామ్ చరణ్ గట్టి సమాధానం ఇచ్చారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ లో రంగస్థలంకి, ఆ కాంబినేషన్‌కి ప్రత్యేక స్థానం ఉంది. అందుకనే ఈ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు సెట్ అవుతుందో అని RC17 కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే కేవలం ఈ ఎదురు చూపులు వలనే RC17 పై భారీ హైప్ క్రియేట్ అవ్వలేదు. ఈ సినిమా గురించి ‘ఆర్ఆర్ఆర్’ సమయంలో రాజమౌళి చేసిన కామెంట్స్.. అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. ఈ సినిమాలోని రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ వేరే లెవెల్ లో ఉంటుందని, ఆ సీన్ కి ఆడియన్స్ సీట్స్ నుంచి లేచి విజుల్స్ వేస్తారని రాజమౌళి చెప్పుకొచ్చారు.
Also read : Inimel : శృతిహాసన్, లోకేష్ కనగరాజ్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది..
అంతేకాదు ఆ సీన్ షూటింగ్ కూడా సుకుమార్ ఆల్రెడీ పూర్తి చేసేశారని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని ఇంట్రడక్షన్ సీన్ లో రామ్ చరణ్ లుక్ గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ లుక్ అండ్ బాడీతోనే సుకుమార్ కి ఆ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ కావాల్సి ఉండడంతో.. ఆ సమయంలోనే రాజమౌళి పర్మిషన్ తో ఆ సీన్ ని రూపొందించేశారు. ఆర్ఆర్ఆర్ లోని ఇంట్రడక్షన్ సీనే ఓ రేంజ్ లో ఉంటుంది.
అలాంటిది ఇప్పుడు మళ్ళీ అదే లుక్ తో అంతకుమించిన సీన్ అని రాజమౌళి చెప్పడంతో.. ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో అభిమానులంతా.. అప్పటి రాజమౌళి వీడియోని వైరల్ చేస్తున్నారు.
View this post on Instagram