Inimel : శృతిహాసన్‌, లోకేష్ కనగరాజ్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది..

శృతిహాసన్‌, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి నటించిన ‘ఇనిమెల్’ ఆల్బమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

Inimel : శృతిహాసన్‌, లోకేష్ కనగరాజ్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది..

Shruti Haasan Lokesh Kanagaraj Inimel cover song released

Updated On : March 25, 2024 / 7:16 PM IST

Inimel : హీరోయిన్ కమ్ సింగర్ శృతిహాసన్.. సినిమాలోని పాటలను పడడమే కాకుండా, అప్పుడప్పుడు ఆల్బం సాంగ్స్ కూడా చేస్తుంటుంది. తాజాగా ‘ఇనిమెల్’ అనే ఒక కవర్ సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ సాంగ్ ని కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తూనే.. లిరిక్స్ ని కూడా రాసారు. ఇక ఈ సాంగ్ లో శృతిహాసన్ తో పాటు యాక్షన్ థ్రిల్లర్ సినిమాలతో ఫేమ్ సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్ హీరోగా నటించారు.

ఇటీవల ఈ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేసి అందర్నీ సర్‌ప్రైజ్ చేసారు. ఆ టీజర్ లో లోకేష్ కనగరాజ్, శృతిహాసన్ తో రొమాన్స్ చేస్తూ కనిపించారు. అది చూసిన ఆడియన్స్.. లోకేష్ నుంచి ఇలాంటి ఓ యాంగిల్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ కామెంట్స్ చేసారు. దీంతో ఫుల్ సాంగ్ అసలు ఎలా ఉంటుందో అనే ఆసక్తిని క్రియేట్ అయ్యింది. తాజాగా ఆ సాంగ్ ఫుల్ వెర్షన్ ని రిలీజ్ చేసారు.

Also read : Varun Tej – Lavanya Tripathi : హిమాచల్‌ప్రదేశ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మెగా కపుల్.. పర్వతాలు అధిరోహించి..

కాగా ఈ సాంగ్ తమిళ్ భాషలో ఉండడం వల్ల మీనింగ్ ఏంటో అర్ధం కాలేదు గాని, పిక్చర్ విజువలైజేషన్ చూస్తుంటే మాత్రం.. ఇప్పటి జనరేషన్ లవ్, మ్యారేజ్, ఫైటింగ్స్, బ్రేకప్ గురించి చెప్పినట్లు తెలుస్తుంది. సాంగ్ విజువలైజేషన్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. పాటని కంపోజ్ చేయడం, పాడడం, పిక్చరైజేషన్ చేయడం అంతా శృతిహాసనే కావడం విశేషం.