Game Chnager : ‘గేమ్ ఛేంజర్’ మళ్ళీ వాయిదా.. తనయుడు కోసం తగ్గిన తండ్రి.. చరణ్ కోసం చిరు సాయం..

తాజాగా దిల్ రాజు గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి మాట్లాడుతూ ఓ వీడియోని రిలీజ్ చేసారు.

Game Chnager : ‘గేమ్ ఛేంజర్’ మళ్ళీ వాయిదా.. తనయుడు కోసం తగ్గిన తండ్రి.. చరణ్ కోసం చిరు సాయం..

Ram Charan Game Changer Date Changed Said by Dil Raju Fans Disappointed

Updated On : October 12, 2024 / 9:51 AM IST

Game Chnager : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం మూడేళ్ళుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేకసార్లు ఈ సినిమాని వాయిదా వేశారు. క్రిస్మస్ కి వస్తుందని గత కొన్ని రోజులుగా మూవీ టీమ్ చెప్పారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేసారు. ఇప్పటికే రెండు పాటలు కూడా రిలీజ్ చేయగా బాగా వైరల్ అయ్యాయి.

కానీ దసరా పండగ పూట మరోసారి మెగా అభిమానులకు నిరాశ ఎదురైంది. తాజాగా దిల్ రాజు గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి మాట్లాడుతూ ఓ వీడియోని రిలీజ్ చేసారు.

Also Read : Gayatri Bhargavi : పండగ పూట కొత్త కార్ కొన్న యాంకర్ నటి.. పూజలు చేసి.. వీడియో చూశారా..?

ఈ వీడియోలో దిల్ రాజు మాట్లాడుతూ.. క్రిస్మస్ కి వద్దాం అనుకున్నాము కానీ డిస్ట్రిబ్యూటర్స్, వరల్డ్ వైడ్ మార్కెట్ చూసుకొని పెద్ద సినిమా కాబట్టి సంక్రాంతికి వద్దాం అని ఫిక్స్ అయ్యాము. సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమా రాబోతుంది. చిరంజీవి విశ్వంభర సినిమా సంక్రాంతికి ఉండటంతో ఆ మూవీ టీమ్ తో మాట్లాడాము. దానికి వాళ్ళు విశ్వంభర వాయిదా వేయడానికి ఒప్పుకున్నారు అని తెలిపారు.

దీంతో సంక్రాంతికి రావాల్సిన మెగాస్టార్ విశ్వంభర సినిమా వాయిదా పడుతుందని క్లారిటీ వచ్చేసింది. తనయుడు రామ్ చరణ్ కోసం తండ్రి చిరంజీవి తగ్గాడని సంక్రాంతి రిలీజ్ డేట్ ఇచ్చాడని మెగా అభిమానులు మరోసారి చిరంజీవిని అభినందిస్తున్నారు.