Ram Charan: శంకర్ సినిమాలో చరణ్ అలా కనిపిస్తాడా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ వంటి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే....

Ram Charan Interesting Role In Shankar Movie
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ వంటి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలవగా, ఆచార్య చిత్రం ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. ఈ రెండు సినిమాలు కూడా మల్టీస్టారర్ చిత్రాలుగా రావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇక ప్రస్తుతం చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్టులో బిజీగా మారిపోయాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
Ram Charan : పంజాబ్ లో RC15 షూట్.. RRR ఎఫెక్ట్.. చరణ్‌తో ఫోటోల కోసం పంజాబ్ పోలీసుల క్యూ..
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా వైజాగ్ షెడ్యూల్‌లో చరణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్ర యూనిట్. అయితే ఈ షెడ్యూల్‌లో చరణ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో చరణ్ పాత్రకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చరణ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడని.. ఓ పాత్రలోని చరణ్‌కు కోపం ఎక్కువగా ఉంటుందని.. అతడు చేసే మ్యానరిజం చూడటానికి చాలా బాగుంటుందని తెలుస్తోంది.
Ram Charan: శంకర్ సినిమాలో చరణ్ పాత్ర అదేనా..?
ఇక మరొక పాత్రలో చరణ్ పల్లెటూరి నుండి వచ్చిన రాజకీయ నేతగా మనకు కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పాత్రల్లో చరణ్ వైవిధ్యమైన లుక్స్‌లో కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో పక్కనబెడితే, ప్రస్తుతం చరణ్ క్రేజ్ కారణంగా ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.