Ram Charan: మళ్లీ అమృత్‌సర్ చెక్కేస్తున్న చరణ్.. ఈసారి దేనికో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో.....

Ram Charan: మళ్లీ అమృత్‌సర్ చెక్కేస్తున్న చరణ్.. ఈసారి దేనికో తెలుసా?

Ram Charan Shankar Movie To Shoot In Amritsar

Updated On : June 27, 2022 / 3:15 PM IST

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకులు మాత్రం వదలడం లేదు. తాజాగా ఈ సినిమా చిత్ర యూనిట్ అమృత్‌సర్ చెక్కేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Ram Charan: చరణ్‌తో సినిమాపై లోకేశ్ క్లారిటీ!

గతంలో అమృత్‌సర్ వెళ్లిన చరణ్, ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అక్కడ సందడి చేశాడు. అయితే ఇప్పుడు మాత్రం శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం చరణ్ అండ్ టీమ్ అమృత్‌సర్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా అక్కడ కేవలం 5 రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ నయా లుక్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయనుండగా, శంకర్ తనదైన మార్క్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Ram Charan: బాలీవుడ్‌లో చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా..?

ఇక ఈ సినిమాను పూర్తి పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, ఈ సినిమాలో ఆయన సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాలో అంజలి, సునీల్, తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి అమృత్‌సర్‌లో చరణ్ సినిమాకు సంబంధించి ఎలాంటి సీన్స్‌ను షూట్ చేస్తారో చూడాలి.