Ram Charan : రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా మళ్ళీ తమిళ్ డైరెక్టర్‌తో? నిజమేనా?
కెరీర్‌లో ఎక్కువ బంపర్ హిట్స్ చిత్రాలు చేసిన శంకర్ దర్శకత్వంపై వచ్చే సినిమాపై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో చరణ్ త్వరలో మళ్లీ కోలీవుడ్‌కే చెందిన డైరెక్టర్‌తో సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.

Ram Charan will plan next movie also with Tamil Director after Buchibabu Movie
Ram Charan : తమిళ డైరెక్టర్ శంకర్‌తో(Shankar) గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. డైరెక్టర్ శంకర్‌తో గేమ్ ఛేంజర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మైత్రీ మూవీ మేకర్స్‌తో బుచ్చిబాబు(Buchhi Babu) దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పూర్తయ్యేలోగా మరో సినిమాకు ప్లాన్ చేస్తున్న రామ్‌చరణ్ కోలీవుడ్ డైరెక్టర్లతో చర్చలు జరపడం చర్చనీయాంశవుతోంది. అదీ తమిళంలో సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్లతోనే మాటలు కలపడం ఇండస్ట్రీని ఆకర్షిస్తోంది. శంకర్ తర్వాత ఇంకో కోలీవుడ్ దర్శకుడికి రామ్ చరణ్ ఛాన్స్ ఇస్తారని సమాచారం.
తమిళ డైరెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌పై అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కెరీర్‌లో ఎక్కువ బంపర్ హిట్స్ చిత్రాలు చేసిన శంకర్ దర్శకత్వంపై వచ్చే సినిమాపై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో చరణ్ త్వరలో మళ్లీ కోలీవుడ్‌కే చెందిన డైరెక్టర్‌తో సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.
ఇటీవల డైరెక్టర్ శంకర్ పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన రామ్ చరణ్… తమిళ డైరెక్టర్స్ లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజు, నెల్సన్ దిలీప్‌కుమార్‌తో చర్చలు జరపడంపై రకరకాల ప్రచారం జరగుతోంది. శంకర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఉండగా.. రామ్ చరణ్ ఈ ముగ్గురు డైరెక్టర్లతో మాటలు కలిపి మంచి కథ ఉంటే సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు సంకేతాలిచ్చారని టాలీవుడ్ సమాచారం.
కోలీవుడ్‌లో ఆ ముగ్గురు డైరెక్టర్లకు మంచి క్రేజ్ ఉంది. కలెక్షన్ల వర్షం కురిపించిన విక్రమ్, మాస్టర్ వంటి చిత్రాలను తీసి హిట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు లోకేశ్ కనగరాజ్. ఇక నెల్సన్ దిలీప్‌కుమార్ కూడా తలైవర్ రజనీతో జైలర్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. కార్తీక్ సుబ్బరాజు కూడా మంచి హిట్ సినిమాలు తీశాడు. వీరి కాంబో సినిమా చేస్తే తప్పకుండా హిట్ అవుతుందనే అంచనాతో మంచి స్టోరీ తయారు చేయమని చెప్పాడట రామ్ చరణ్. ఈ ముగ్గురు డైరెక్టర్లతో రామ్ చరణ్ చర్చలు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.
ఇక తమిళ్ స్టార్ డైరెక్టర్స్ అందరు ఒక ఫోటో దిగగా అందులో తెలుగు హీరో రామ్ చరణ్ ఒక్కడే ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. దీంతో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలపై మరింత ఆసక్తి నెలకుంది. ఇక లోకేష్ కనగరాజ్ గతంలోనే రామ్ చరణ్ తో సినిమా తీస్తాను అని ప్రకటించాడు. చూడాలి మరి రామ్ చరణ్ ఏ తమిళ్ స్టార్ డైరెక్టర్ తో మళ్ళీ సినిమా తీస్తాడో.