చదువుసెప్పినోళ్లు ఎవరోకానీ : బాటిల్ తో టీచర్స్ డే విషెస్ చెప్పిన వర్మ

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 06:48 AM IST
చదువుసెప్పినోళ్లు ఎవరోకానీ : బాటిల్ తో టీచర్స్ డే విషెస్ చెప్పిన వర్మ

Updated On : September 5, 2019 / 6:48 AM IST

గురుదేవో భవ.. ఆచార్య దేవోభవ అంటూ ప్రతి సెప్టెంబర్ 5వ తేదీన చదువుతోపాటు సంస్కారం నేర్పిన గురువులను పూజించుకుంటాం.. స్మరించుకుంటాం. వీలైతే వారి ఆశీర్వాదం తీసుకుంటాం. సహజంగా అందరూ చేసే పని ఇది. ఇందుకు డిఫరెంట్ రాంగోపాల్ వర్మ. డే ఏదైనా వైవిధ్యం ఎక్కువగా చూపిస్తుంటారు.. సెప్టెంబర్ 5న టీచర్స్ డే రోజున అదే వెరైటీ ట్విట్ తో శుభాకాంక్షలు చెప్పారు వర్మ. 

టీచర్స్ డే రోజున.. టీచర్స్ విస్కీ బాటిల్ తో లింక్ పెట్టి ట్వీట్ చేశారు. టీచర్స్ డే రోజు టీచర్లు.. టీచర్స్ విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా అంటూ క్వశ్చన్ చేశారు. జస్ట్ అస్కింగ్ అంటూ కామెంట్ చేశారు. తనను మంచి విద్యార్థిగా, మానవతావాదిగా తీర్చిదిద్దడంలో తన టీచర్లు ఫెయిల్ అయ్యారని.. అందువల్ల తనకు టీచర్స్ డే అంటే ఏంటో తెలియదంటూ తన వాదన వినిపించారు సార్ వారు. తాను ఓ బ్యాడ్ స్టూడెంట్ అంటూ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. తన గురువులంతా.. మంచి ఉపాధ్యాయులు కాలేకపోయారని వాళ్ళంతా చెడ్డ వాళ్ళేనని ట్విట్ చేశారు వర్మ గారు. 

అంటే అన్నారంటారు కానీ.. ఆ టీచర్లు అలా చెప్పబట్టే కదండీ.. ఇలా సినిమాలు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. వర్మ అనుకుంటున్నట్లు ఆ మాత్రం చదువు కూడా చెప్పకపోతే మాఫియా సినిమాలు తీయటం కాకుండా.. మాఫియా డాన్ అయ్యేవాడేమో అంటున్నారు నెటిజన్లు. వర్మ టీచర్లు మంచోళ్లు అయ్యి ఉంటే.. ఏం అయ్యేవాడనే డిస్కషన్ కూడా నడుస్తోంది.