Ram Gopal Varma : 2024 ఏపీ ఎన్నికల కోసమే వ్యూహం, శపథం సినిమాలు తీస్తున్నా.. సినిమాకి వైసీపీ ఫండింగ్..!

వ్యూహం, శపథం సినిమాలను 2024 ఏపీ ఎన్నికల కోసమే తీస్తున్నట్లు వర్మ కుండ బద్దలుకొట్టేశాడు. ఇక ఈ సినిమాలకు వైసీపీ ఫండింగ్ చేస్తుందా అనే ప్రశ్నకు బదులిస్తూ..

Ram Gopal Varma : 2024 ఏపీ ఎన్నికల కోసమే వ్యూహం, శపథం సినిమాలు తీస్తున్నా.. సినిమాకి వైసీపీ ఫండింగ్..!

Ram Gopal Varma making Vyooham and Shapatham movies for 2024 elections and YCP

Updated On : August 13, 2023 / 6:04 PM IST

Ram Gopal Varma : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గత ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయంలో జరిగిన అంశాలను తీసుకోని సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) జీవితం ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న సినిమాలు ‘వ్యూహం’ (Vyooham), ‘శపథం’. ఈ సినిమాల అనౌన్స్ తోనే ఏపీ పాలిటిక్స్ లో సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం వ్యూహం మూవీ షూటింగ్ జరుగుతుండగా.. ఇందులోని కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రెజెంట్ విజయవాడలో జరుగుతుంది. షూటింగ్ గ్యాప్ లో వర్మ మీడియా ప్రతినిధులతో మాట్లాడి సినిమా విషయాలను తెలియజేశాడు.

Ram Gopal Varma : వైసీపీ నేతల మాటల్ని కొట్టిపడేస్తూ.. చిరంజీవికి సపోర్ట్‌గా నిలిచిన వర్మ.. ఏ విషయంలో తెలుసా..?

2024 ఏపీ ఎన్నికల లక్ష్యంగానే ఈ రెండు చిత్రాలను తెరకెక్కిస్తున్నట్లు, అందులో ఎటువంటి సందేహం, రహస్యం లేదని చెప్పుకొచ్చాడు. ఇక విపక్షాలను టార్గెట్ చేయడానికే ఈ సినిమాలు తెరకెక్కిస్తున్నారా అనే ప్రశ్నకు వర్మ బదులిస్తూ.. “గత ఎన్నికల సమయంలో సీనియర్ ఎన్టీఆర్ విషయంలో నేను నమ్మిన నిజాన్ని చూపిస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెరకెక్కించాను. ఇప్పుడు కూడా జగన్ లో నేను చూసిన రియాలిటీని, అతని విషయంలో నేను నమ్మిన నిజాన్ని ఆధారాలతో చూపిస్తూనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. అది జగన్ కి మళ్ళీ అధికారం తెచ్చిపెడుతుందా? లేదా? అనేది నాకు అనవసరం” అంటూ పేర్కొన్నాడు.

Ram Gopal Varma : వివేకా కేసులోని నిందితుడిని ‘వ్యూహం’ సినిమాలో వర్మ చూపించబోతున్నాడా..?

పవన్ కళ్యాణ్ గురించి ఏమి చూపించబోతున్నారు అని అడిగిన ప్రశ్నకు వర్మ బదులిస్తూ.. “నేను ముందు నుంచి చెప్పుకొస్తుందే పవన్ కళ్యాణ్ నిలకడ లేని వ్యక్తి” అంటూ వెల్లడించాడు. గత ఎన్నికలు నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్యమైన సన్నివేశాలని ఈ సినిమాలో ఉండబోతున్నాయని పేర్కొన్నాడు. వాటిలో వివేకా హత్య కేసుకి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయి వెల్లడించాడు.

Chiranjeevi : భోళా శంకర్ అయిపోయింది.. చిరు నెక్స్ట్ ఏంటి? బర్త్ డేకి ఆ దర్శకుడితో సినిమా అనౌన్స్?

ఇక ఈ సినిమాకి వైసీపీ నుంచి ఫండింగ్ వస్తుందనే కామెంట్స్ కి బదులిస్తూ.. “ఈ చిత్రానికి నిర్మాత దాసరి కిరణ్ డబ్బులు పెడుతున్నాడు. మరి ఆయనకు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆయన్నే అడగండి. ఒకవేళ వైసీపీ డబ్బులు ఇచ్చి ఈ సినిమా తీయించినా, లేక నాఇష్టంతో తీసినా లాభం కలిగేది వైసీపీ వాళ్లకే అయ్యినప్పుడు ఈ క్యూస్షన్ ఎందుకు” అంటూ బదులిచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ 70 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని, మొదటి భాగం వ్యూహం ఈ అక్టోబర్ లో, శపథం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.