Ram Gopal Varma : పవన్, లోకేశ్ డబ్బులిచ్చి.. వాళ్లకి అనుకూలంగా సినిమా తీయమంటే చేస్తారా..? వర్మ జవాబు ఏంటి..?

పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ డబ్బులిచ్చి వాళ్లకి అనుకూలంగా సినిమా తీయమంటే రామ్ గోపాల వర్మ చేస్తాడా అని ప్రశ్నించగా, తాను బదులిస్తూ..

Ram Gopal Varma : పవన్, లోకేశ్ డబ్బులిచ్చి.. వాళ్లకి అనుకూలంగా సినిమా తీయమంటే చేస్తారా..? వర్మ జవాబు ఏంటి..?

Ram Gopal Varma said no to make movies on Pawan Kalyan Nara Lokesh

Updated On : August 13, 2023 / 7:38 PM IST

Ram Gopal Varma : సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాలు ‘వ్యూహం’ (Vyooham), ‘శపథం’. 2024 ఏపీ ఎన్నికల లక్ష్యంగా వర్మ ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. మొదటి భాగం వ్యూహం ఈ అక్టోబర్ లో రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ మూవీ 70 శాతం షూటింగ్ పూర్తి అయ్యినట్లు వర్మ తెలియజేశాడు. ఇక శపథం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

Ram Gopal Varma : వివేకా కేసులోని నిందితుడిని ‘వ్యూహం’ సినిమాలో వర్మ చూపించబోతున్నాడా..?

కాగా ఈ రెండు చిత్రాలను వర్మ సీఎం జగన్ ను హీరోగా చూపిస్తూ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు వైసీపీ నుంచి ఫండింగ్ వస్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అండ్ లోకేశ్ (Nara Lokesh) కూడా డబ్బులు పేటి వాళ్ళకి అనుకూలంగా సినిమా తీయమంటే చేస్తారా? అని వర్మని ప్రశ్నించగా, తాను తీయను అంటూ బదులిచ్చాడు. “లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో నేను సీనియర్ ఎన్టీఆర్ విషయంలో నమ్మిన నిజాన్ని చూపిస్తూనే తెరకెక్కించాను. ఇప్పుడు జగన్ లో కూడా నేను చూసిన రియాలిటీని, అతని విషయంలో నేను నమ్మిన నిజాన్ని ఆధారాలతో చూపిస్తూనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా” అంటూ వెల్లడించాడు.

Ram Gopal Varma : వైసీపీ నేతల మాటల్ని కొట్టిపడేస్తూ.. చిరంజీవికి సపోర్ట్‌గా నిలిచిన వర్మ.. ఏ విషయంలో తెలుసా..?

అది విపక్షాలను టార్గెట్ చేసేలా ఉంటుందా? జగన్ కి మళ్ళీ అధికారం తెచ్చిపెడుతుందా? లేదా? అనేది నాకు అనవసరం అంటూ పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ పాత్ర కూడా ఉండబోతుందని, తాను ముందు నుంచి చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో నిలకడ లేని వ్యక్తిగా చూపించబోతున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం వ్యూహం మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ విజయవాడలో జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి అయిన పోస్టర్ అండ్ టీజర్స్ చూసిన ఆడియన్స్.. ఈ సినిమాల్లో వర్మ ఏవేవి చూపించబోతున్నాడా అని ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ నెలకొంది.