వైరస్ కంటే వాయిస్ భయంకరంగా ఉంది..
కరోనా ఎఫెక్ట్ : ‘కనిపించని పురుగు’ పాట విడుదల చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..

కరోనా ఎఫెక్ట్ : ‘కనిపించని పురుగు’ పాట విడుదల చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..
ఏ విషయాన్ని ఎప్పుడు ఎలా చెప్పాలో, ఏ సందర్భాన్నైనా పబ్లిసిటీకి ఎలా వాడుకోవాలో కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి గతకొద్ది రోజులుగా తనదైన శైలిలో ట్వీట్లు వేస్తున్న వర్మ తాజాగా కరోనా మహమ్మారి గురించి ఓ పాట విడుదల చేసాడు.
ఈ పాటను ఆయనే రాసి, తన మధురమైన గొంతుతో ఆలపించడం విశేషం. శాండీ అద్దంకి ట్యూన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ చేతులు కడుక్కుని, చెవులకు మాస్క్ తొడుక్కుని వినమని వర్మ సలహా ఇచ్చాడు. ‘‘అది ఒక పురుగు.. కనిపించని పురుగు.. కరోనా అనే ఒక పురుగు.. నీ బతుకుకి ఒక చిరుగు.. అయినా చివరికి మంచే జరుగు.. ఎందుకంటే అది ఒక పురుగు’’.. అంటూ వర్మ కరోనా వైరస్ ఎలాంటిదో, ఎంత ప్రమాదకరమైనదో తన స్టైల్‌లో వివరించే ప్రయత్నం చేసాడు.
విజువల్‌గానూ సాంగ్ ఎడిటింగ్ బాగుంది. ఆర్జీవీ కరోనా పాట బాగుందని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు కరోనా వైరస్ కంటే వర్మ వాయిస్సే భయంకరంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వర్మ ‘కనిపించని పురుగు’ సాంగ్ వైరల్ అవుతోంది.