బాలకృష్ణ తప్పు అదేనట.. వర్మ పెట్టిన సంచలన వీడియో!

  • Published By: vamsi ,Published On : February 23, 2019 / 07:19 AM IST
బాలకృష్ణ తప్పు అదేనట.. వర్మ పెట్టిన సంచలన వీడియో!

Updated On : February 23, 2019 / 7:19 AM IST

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మించి నటించిన సినిమా ఎన్టీఆర్‌ మహానాయకుడు. తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావటంతో రెండో భాగాన్ని పెద్దగా ప్రమోషన్‌ లేకుండా సైలెంట్‌ గా రిలీజ్ చేశారు బాలకృష్ణ.

ఇదే సమయంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాపై తనదైన స్టైల్‌లో సెటైర్లు వేస్తున్నాడు. ఇటీవల వరుసగా ట్వీట్లు వేస్తూ.. వేడి పెంచిన వర్మ తాజాగా బాలకృష్ణ చెప్పినట్లుగా ఒక వీడియోని రూపొందించి విడుదల చేశాడు.
Read Also: ఏపీలో వచ్చేది జగన్ ప్రభుత్వమే : కేటీఆర్ జోస్యం

ఆ ట్వీట్ లో పెట్టిన వీడియోలో “నేను నా జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు ఎన్టీఆర్ గారి బయోపిక్ తీయడం” అంటూ బాలకృష్ణ చెప్పినట్లుగా ఉంది. ఆ వీడియో పైన ఈ వీడియో నాకు ఎవరూ పంపలేదు అంటూ రాశారు.

వరుసగా ట్వీట్లు వేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ చేసుకుంటున్న వర్మ.. మహానాయకుడు సినిమా టైమ్ ను కూడా తన సినిమా ప్రమోషన్ చేసుకునేందుకు వాడుకుంటున్నట్లు అర్థం అవుతుంది.
Read Also: నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారు

మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్లను వేగం చేసిన వర్మ ఆదివారం ఉదయం 9:27నిమిషాలకు సినిమా నుంచి ఫస్ట్ పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలోని నా ఉనికి నా జీవితానికి అర్థం అంటూ సాగే మొదటి పాటను లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినట్లు తెలిపారు. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ గారికి గొప్పగొప్ప పాటలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందించినట్లు గుర్తు చేశారు.

Read Also: హక్కులను కాలరాస్తున్నారు: కేంద్రంపై కేసీఆర్ గుస్సా